Saturday, March 7, 2026

హుజూర్ నగర్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

​హుజూర్ నగర్, మార్చి 7, 2026:
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాల్‌లో శనివారం మహిళా దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు.
​ముఖ్య అతిథిగా అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి
​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి షేక్ ఆయేషా సరీన్, ఎంపీడీఓ హుజూర్నగర్ పట్టణ చైర్మన్ దొంతగాని శ్రీను, వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో మహిళల పాత్ర కీలకమైనదని, ప్రతి మహిళా తన హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాలని ఆకాంక్షించారు.
​ఘనంగా సన్మానం
​కార్యక్రమంలో భాగంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను జడ్జి గారు శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం, అక్కడికి విచ్చేసిన మహిళలు మరియు మహిళా కౌన్సిలర్లు అందరూ కలిసి అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి షేక్ ఆయేషా సరీన్ వారిని పూలమాలలు మరియు శాలువాలతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు.
 ఇట్టి కార్యక్రమంలో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి షేక్ ఆయేషా సరీన్, మరియు హుజూర్నగర్ పట్టణ చైర్మన్ దొంతగాని శీను, వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున్, మహిళా కౌన్సిలర్లు హుజూర్నగర్ మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Friday, January 16, 2026

సత్తెనపల్లి జడ్జి జూనెబోయిన సుజన్ కుమార్‌ను కలిసిన రేవూరు సర్పంచ్

సత్తెనపల్లి జడ్జి జూనెబోయిన సుజన్ కుమార్‌ను కలిసిన రేవూరు సర్పంచ్

జగ్గయ్యపేట: రేవూరు గ్రామ వాస్తవ్యులు, ప్రస్తుతం గుంటూరు జిల్లా సత్తెనపల్లి జడ్జిగా విధులు నిర్వహిస్తున్న జూనెబోయిన సుజన్ కుమార్ గారిని రేవూరు గ్రామ సర్పంచ్ జూనెబోయిన గురవయ్య మరియు ప్రముఖ న్యాయవాది జూనెబోయిన శ్రీనివాసరావు గారు మర్యాదపూర్వకంగా కలిశారు.

​జగ్గయ్యపేటలో జరిగిన ఈ భేటీలో భాగంగా, తమ గ్రామస్తుడు ఉన్నత స్థానంలో ఉండటం పట్ల సర్పంచ్ మరియు ఇతర సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జడ్జి సుజన్ కుమార్ గారు సర్పంచ్ గురవయ్య గారిని ఘనంగా సత్కరించారు.

పాల్గొన్న వారు:

ఈ కార్యక్రమంలో రేవూరు గ్రామానికి చెందిన ప్రముఖులు:

  • ​తోడేటి నాగేశ్వరరావు
  • ​ఆనంగి వెంకటేశ్వర్లు
  • ​ఎస్.కె. హుస్సేన్
  • ​బాబ్జి

​తదితరులు పాల్గొని తమ మద్దతును, శుభాకాంక్షలను తెలియజేశారు.

Sunday, December 28, 2025

ఘనంగా హజరత్ ఖాజాగరీబ్ నవాజ్ అలై సందాల్ ముబారక్ ఉరుసు

 


మనభూమి వార్త

హుజూర్ నగర్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

​హుజూర్ నగర్, మార్చి 7, 2026: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని బాలాజీ ఫంక్...

ఎక్కువమంది చూసినా వార్త