Monday, June 23, 2025

పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు పంపిణీ

భారతీయ జనతా పార్టీ సూర్యాపేట జిల్లా కార్యాలయంలో డా. శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన బిజెపి జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలతరెడ్డి గారు...

అనంతరం జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు బూర శకుంతల గారి ఆధ్వర్యంలో, స్థానిక శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో  నిర్వహించినటువంటి మొక్కల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలతరెడ్డి గారు హాజరై డా. శ్యామాజీ గారి త్యాగాలను స్మరించుకుంటూ, పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు పంపిణీ చేశారు...

చల్ల శ్రీలతరెడ్డి “డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు భారత రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే వ్యక్తిత్వం. వారు స్వాతంత్ర్యానంతర భారత రాజకీయం లో విలక్షణ మార్గాన్ని ఎంచుకుని దేశ సమగ్రత, ఏకత్వం కోసం నిరంతరంగా కృషి చేశారనీ, ప్రఖ్యాత విద్యావేత్తగా, 33ఏళ్ల వయసులోనే కలకత్తా విశ్వవిద్యాలయానికి వైస్ చాన్సలర్‌గా నియమితులై, విద్యా రంగంలో నూతనోత్సాహాన్ని తీసుకొచ్చారని కొనియాడారు...

వారు కేంద్ర మంత్రిగా పనిచేసినపుడు పారిశ్రామికాభివృద్ధికి మార్గసూచినిచ్చారు. అయితే జమ్మూ కాశ్మీర్ విషయంలో నెహ్రూ ప్రభుత్వ విధానాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా (ఆర్టికల్ 370) కల్పించడమూ, ఆ రాష్ట్ర ప్రస్తుత పరిస్థితులను దేశంలో విలీనపరచకుండా ఉంచడమూ ఆయనకు అందలేని విషయాలు అయ్యాయని, ఆయన అభిప్రాయం ప్రకారం – “దేశం ఒక్కటే అయితే, రాజ్యాంగం ఒక్కటే ఉండాలని, రెండు జెండాలు, రెండు ప్రధానులు అనే వ్యవస్థ దేశాన్ని చీల్చే ప్రయత్నమే అవుతుంది.” అని హితవు పలికారు...

ఈ నినాదంతో 1953లో ఆయన్ను కాశ్మీర్‌లో ప్రవేశించిన వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన ఆరోగ్య పరిస్థితిని పట్టించుకోకుండా జైలులో నిర్లక్ష్యంగా ఉంచారని జూన్ 23న ఆయన మరణించడంతో, అది అనుమానాస్పద మృతిగా చరిత్రలో నమోదైందన్నారు. నెహ్రూ ప్రభుత్వం ఆయన మరణంపై పూర్తిస్థాయిలో విచారణ చేయకపోవడమూ, ఈ సంఘటనకు ఇప్పటికీ న్యాయం జరగకపోవడమూ ఆవేదన కలిగించే అంశాలుగా ఉన్నాయన్నారు...

వారి త్యాగం భారతదేశ సమగ్రతకు బలమైన నాంది. ఆయన బలిదానమే భవిష్యత్‌లో ఆర్టికల్ 370 రద్దు వంటి చారిత్రక నిర్ణయాలకు బీజమైంది. దేశం పట్ల ఆయనకున్న రాజీపడనటువంటితత్త్వo నేటి యువతకు మార్గదర్శకంగా నిలవాలన్నారు...

ఇలాంటి మహానుభావుని బలిదానాన్ని స్మరించుకుంటూ, ఈ బలిదాన్ దివస్‌ను నిర్వహించడం, పర్యావరణ పరిరక్షణకు సూచకంగా మొక్కలు పంపిణీ చేయడం ఎంతో ప్రాముఖ్యత కలిగినదిగా భావిస్తున్నామన్నారు... పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై డా. శ్యామాజీ గారి త్యాగాలను పునఃస్మరించుకోవాలని అన్నారు...

ఇట్టి కార్యక్రమంలో ప్రోగ్రాం కన్వీనర్ బూర మల్సూర్ గౌడ్, జల్లా జనార్ధన్, బిజెపి సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కడియం రాంచంద్రయ్య, జుట్టుకొండ సత్యనారాయణ, చల్లమల నరసింహ, రుక్మారావు, మన్మధరెడ్డి, గజ్జల వెంకటరెడ్డి, మహేష్, లింగారెడ్డి, కాషయ్య, ఫణినాయుడు, రవి, తాళ్ల నరేందర్ రెడ్డి, శోభారెడ్డి, మౌనిక,  దాసరివెంకన్న, బైరు విజయ్ కృష్ణ, వర్మ, గణేష్, తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు...

*హుజూర్ నగర్ ఎస్సై ముత్తయ్య కి ఘనంగా వీడ్కోలు సన్మానం*

*హుజూర్ నగర్ ఎస్సై ముత్తయ్య కి ఘనంగా వీడ్కోలు సన్మానం*
హుజూర్ నగర్ నియోజకవర్గం న్యూస్ తెలంగాణ జూన్ 22
హుజూర్ నగర్ ఎస్ఐ ముత్తయ్య నాగార్జునసాగర్ పోలీస్ స్టేషన్ కు బదిలీ అయిన సందర్భంగా మండల ఐ ఆన్ టి యు సి అధ్యక్షులు మేళచెరువు ముక్కంటి ఘనంగా సన్మానించినారు ఆ సందర్భంలో మాట్లాడుతూ హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్లో పనిచేసిన ముత్తయ్య పేదవారు పోలీస్ స్టేషన్ కి వస్తే వాళ్ల సమస్యలు తెలుసుకుని పరిష్కారం మార్గగా చేసేవాడని శాంతియుత పద్ధతి లో పరిష్కార దిశగా ఎంతో కృషి చేసేవాడని యువకులు గంజాయి మత్తులో పడకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ఎక్కడికక్కడే బందోబస్తు ఏర్పాటు చేసి గంజాయి రవాణాలను అరికట్టడంలో ముఖ్యపాత్ర పోషించినాడని ట్రాఫిక్ విషయంలో తనదైన శైలి లోఎటువంటి ఇబ్బందులు కలక్కుండా కృషి చేసిన్నారు.ఈ వీడ్కోలు సన్మానంలో ఐ ఎన్ టి యు సి పెట్టి వెండర్స్ అధ్యక్షులు మద్ధం నాగేందర్ బాబు చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

ఆరు గ్యారెంటీలలో ఏ ఒక్క గ్యారెంటీ ని పూర్తిగా అమలు

ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా తొండి మాటలతో రైతులను మోసం చేయటం రాష్ట్ర ప్రభుత్వానికి తగదు.

 పోకల వెంకటేశ్వర్లు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు 

కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలలో, రైతు భరోసా గాని, రుణమాఫీ గాని,పూర్తిగా రైతులందరికీ అమలు చేయకుండా, అమలు చేసినట్లుగా తొండి మాటలు చెప్పటం రాష్ట్ర ప్రభుత్వానికి తగదని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోకల వెంకటేశ్వర్లు అన్నారు. ఆయన ఈరోజు గరిడేపల్లి మండల కేంద్రంలో పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అమలు చేయక పోవడం వలన ఇంకా కొన్ని వేల మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారని,అయినా కూడా రుణమాఫీ పూర్తి చేసినట్టుగా చెప్పుకోవడం, అలాగే రైతు భరోసా పైసలను తాను అధికారంలోకి వచ్చిన తర్వాత పోయిన వానాకాలం ఒక కారు అందరి రైతులకు కూడా రైతు భరోసా వేయలేదని, వేసంగి కారుకి కేవలం మూడున్నర ఎకరాల రైతుల వరకే రైతు భరోసా వేసి మిగతా రైతులకు వేయకుండా మోసం చేసినారని, ఇప్పుడు కేవలం స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలని ఉద్దేశంతో రైతుబంధు వేస్తున్నారని పాలకులకు ఇది తగదని, పాలకులకు ఒక స్పష్టమైన విధానం వుండాలని,చేస్తే చేస్తమనాలి తప్ప, ఆశలలో ఉంచటం మంచిది కాదని, రుణమాఫీ లో రెండు లక్షలు పైన తీసుకున్న పై పైసలు చెల్లిస్తే ప్రభుత్వం వెంటనే వారి అకౌంట్ లలో రెండు లక్షలు జమ చేస్తామని సాక్షత్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు కూడా అమలు కాలేదని, రైతులు కూడా మీరు రుణమాఫీ చేస్తామన్న రెండు లక్షలు రూపాయలు మాత్రమే అడుగుచున్నారు తప్ప వేరే ఏ గోంతెమ్మ కోర్కెలు కోరటం లేదని ఆయన అన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా, రుణమాఫీ 2 లక్షల రూపాయలు వరకు చేసి,అలాగే యాసంగి ఎవరికైతే రైతులకు రైతు భరోసా వేయలేదో, వారందరికీ రైతు భరోసా పైసలను వారి ఖాతాలలో జమ చేసిన తర్వాత తాము ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చినామని చెప్పుకుంటే బాగుంటుందని, దానిని ప్రజలు రైతులు కూడా హర్షిస్తారని ఆయన అన్నారు.

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఏ ఒక్క గ్యారెంటీ ని పూర్తిగా అమలు చేయలేక చతికల పడటం బాధాకరమని, గత పాలకులు అప్పులు చేయటం వల్ల మేము ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేక పోతున్నామని చెప్పుకోవడం ఇంకా బాధాకరమని, ఎన్నికల సమయంలో రాష్ట్ర రాష్ట్ర ఆదాయం, అప్పుల పై అవగాహన లేకుండా వాగ్దానాలు ఎలా చేశారని ఆయన ప్రశ్నించారు.

ఇప్పటికైనా ప్రజలకిచ్చిన 6 ఆరు గ్యారంటీలను అమలు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి కడియాల అప్పయ్య, సిపిఐ మండల కార్యవర్గ సభ్యులు, కుందూరు వెంకటరెడ్డి, 
పోకల ఆంజనేయులు, నర్సింహారావు,తిరపయ్య,పంగ సైదులు, ఈశ్వరా చారి, షైక్ నబిసాహెబ్, పీరిసాహెబ్, వెంకటేశ్వర్లు, అచ్చయ్య,
 ఎంకన్న,
 తదితరులు పాల్గొన్నారు.

హుజుర్ నగర్ పట్టణం 23 జూలై 09న జరిగే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి

హుజుర్ నగర్ పట్టణం 23 జూలై 09న జరిగే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి 
 ఐఎన్టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎరగని నాగన్న  గౌడ్ పిలుపు   ................................................ 
 కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి కార్మికులు సాధించుకున్న హక్కులను కాలరాస్తుందని ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగన్న గౌడ్ అన్నారు. సోమవారం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఐఎన్టియుసి నియోజకవర్గ ముఖ్య నాయకుల   సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జులై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో దేశంలో అన్ని ట్రేడ్ యూనియన్లు కలసి పాల్గొనున్నాయని ఆయన అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ కొమ్ముకాస్తుందన్నారు. జులై 9న జరిగే సార్వత్రిక సమ్మెలో ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. రాష్ట్రంలోని INTUC ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు. ఐ ఎన్ టి యూ సి జాతీయ అధ్యక్షులు డాక్టర్ సంజీవరెడ్డి అధ్యక్షతన కేంద్రం లోని ట్రేడ్ యూనియన్లు కలిసి సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఆయన కోరారు................................................ ఈకార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తన్నిర్ మల్లిఖార్జున్.. INTUC జిల్లా అధ్యక్షులు ఆలకుంట్ల బాలక్రిష్ణ.. INTUC నియోజకవర్గ అధ్యక్షులు బెల్లంకొండ గురువయ్య.. INTUC మండల అధ్యక్షులు మేళ్ళచెరువు ముక్కంటి.. INTUC పట్టణ అధ్యక్షులు పాశం రామరాజు  యాదవ్.. INTUC జిల్లా సహాయ కార్యదర్శి చింతకాయల రాము.. రైస్ మిల్ల్ డ్రైవర్స్ యూనియన్ సలిగంటి జానయ్య.  INTUC జిల్లా నాయకులు కత్తుల రవీందర్.. ఫ్రూట్ మర్చంట్ యూనియన్ అధ్యక్షులు మద్దం నాగేందర్.. INTUC నియోజకవర్గ మహిళ అధ్యక్షురాలు కల్లు గీత కార్మిక సంఘం యూనియన్ అధ్యక్షులు పాలకూరి లాలు గౌడ్ చప్పిడి సావిత్రి.. మండల మహిళా అధ్యక్షురాలు గడ్డం వెంకటమ్మ.. పాలకిడు మండల అధ్యక్షులు శ్రీను యాదవ్.. లైట్ మోటార్స్ యూనియన్ అధ్యక్షులు ఏదుల నరసింహారావు.. షేక్ ముస్తాఫా.. శ్రీను.తదితరులు పాల్గొన్నారు

*రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుపై* *ప్రభుత్వం పునరాలోచించాలి.*

 *మార్కెట్ వ్యాల్యూ పెంచితే* *రిజిస్ట్రేషన్ స్టాంప్* *డ్యూటీ  3%* *చేయాలి.* 
 *హైడ్రాతో రియల్ ఎస్టేట్* *వ్యాపారం సర్వనాశనం.* 
 *ప్రభుత్వం రిజిస్ట్రేషన్* *కార్యాలయాలను నిర్మించాలి.* 
తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు, సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు పంతంగి వీరస్వామి గౌడ్.
 *(సూర్యాపేట, టౌన్ జులై 23)* 
రాష్ట్ర ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుపై పునరాలోచించాలని ఒకవేళ మార్కెట్ వ్యాల్యూ పెంచితే రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ  3%  చేయాలని తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు, సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు  పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ గార్డెన్ దగ్గర  జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రిజిస్ట్రేషన్ చార్జీలను గత ప్రభుత్వం పెంచిందని గుర్తు చేశారు. తిరిగి నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచితే సామాన్య ప్రజలకు ఇబ్బందిగా మారే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలు కానుందని వివరించారు. మార్కెట్ విలువలు పెరగడం వల్ల సామాన్య ప్రజలకు బిల్డింగ్ పర్మిషన్ తో పాటు ఎల్ ఆర్ ఎస్ కు విపరీతంగా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. మార్కెట్ రేట్లు పెంచడంతో సామాన్య ప్రజలు కనీసం ఇంటిని నిర్మించుకునే పరిస్థితిలో ఉండలేరని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న చార్జీలని అమలు చేయాలని పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో ఎల్ అర్ ఎస్ కోసం ఆన్లైన్లో రూ.10,000 రూపాయలు చెల్లించిన వారికి మున్సిపాలిటీ అధికారులు ఆప్షన్ తీసుకోవట్లేదని తెలిపారు.  ఎల్ఆర్ఎస్ పెండింగ్ లేకుండా రెగ్యులర్ చేసేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ కొరకు వెయ్యి రూపాయలు  కట్టినవే  అమలు చేస్తున్నారు తప్ప పదివేల రూపాయలు  చెల్లించిన వారికి ఎల్లారీస్ రెగ్యులరైజేషన్  చేయడం లేదన్నారు.  రాష్ట్రవ్యాప్తంగా . 142 సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఉన్న వాటిలో పదుల సంఖ్యలో మాత్రమే  సొంత భవనాలు ఉన్నాయని అద్దె భవనాలకు బదులుగా ప్రభుత్వం నూతన సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. సూర్యాపేటలో కృష్ణ కాలనీలో గత 20 సంవత్సరాల క్రితమే సబ్ రిజిస్టర్ కార్యాలయానికి  ఎనిమిది గుంటల స్థలం భూమి యజమానులు సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుకు రిజిస్ట్రేషన్ చేశారని చెప్పారు.  నిధులు కేటాయించాలని  ఆయన విజ్ఞప్తి చేశారు. హైడ్రా వల్ల రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం సర్వనాశనమైందన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ఆధారపడ్డ ఎన్నో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో  రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్, రియల్ ఎస్టేట్  వ్యాపార అసోసియేషన్ జిల్లా  గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కోశాధికారి పాల సైదులు, జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి అంజయ్య గౌడ్,  పట్టణ గౌరవ సలహాదారుడు,  మాదిరెడ్డి గోపాల్ రెడ్డి, పట్టణ ఉపాధ్యక్షుడు ఐతగాని మల్లయ్య గౌడ్, ఆకుల మారయ్య గౌడ్, పట్టణ కార్యదర్శి గిరీశం, పట్టణ ఉపాధ్యక్షుడు బానోతు జానీ నాయక్, సత్యనారాయణ రెడ్డి, నాగయ్య, పట్టణ కార్యదర్శి రాపర్తి జానయ్య, పట్టేటీ కిరణ్, సారగండ్ల కోటేషూ జిల్లా ఉపాధ్యక్షుడు కోడి లింగయ్య,కిషోర్ కుమార్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

పంద్రాగస్ట్ నాటికి భూ సమస్య లు పరిష్కారం

రెవిన్యూ శాఖ పరిపాలన కి వెన్నముఖ లాంటిది జిల్లాలో రెవిన్యూ సదస్సులు విజయవంతం రేషన్ దుకాణాలు తనిఖీలు చేపట్టాలి. జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పంద్రాగస్ట్ నాటికి జిల్లాలో రెవిన్యూ సదస్సుల ద్వారా స్వీకరించిన అర్జీలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయం లోని సమావేశం మందిరంలో అదనపు కలెక్టర్ పి రాంబాబు తో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ భూ భారతి అవగాహన సదస్సులో అలాగే రెవిన్యూ సదస్సుల ద్వారా స్వీకరించిన అర్జీల పరిష్కరణకు రెవిన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ భూ భారతి చట్టం అమలులో భాగంగా జిల్లా వ్యాప్తంగా జూన్ 3 నుండి జూన్ 20 వరకు అన్ని గ్రామాలలో అధికారులే ప్రజల వద్దకి వెళ్ళి 44,741 అర్జీలు స్వీకరించి విజయవంతం చేసినందుకు రెవిన్యూ సిబ్బందిని కలెక్టర్ అభినందించారు.ఆ అర్జీలను మిస్సింగ్ సర్వే నెంబర్, డి ఎస్ పెండింగ్, విస్తీర్ణం సవరణ, పౌతి అమలు,భూమి స్వభావం లాంటి వాటిపై వచ్చినవి విడివిడిగా అర్జీలను వేరు చేయాలని తెలిపారు.జిల్లా వ్యాప్తంగా ఒకే రకంగా అర్జీలను ఒకే విధానం ద్వారా పంద్రాగస్ట్ నాటికి పరిష్కరించాలని సూచించారు.

అర్జీలను పరిష్కరించేందుకు ప్రతి తహసీల్దార్ కార్యాలయం లో డెస్క్ పని చేసేందుకు ఒక బృందం, క్షేత్ర స్థాయి పరిశీలన చేసేందుకు మరో బృందం ఏర్పాటు చేయాలని సూచించారు.అర్జీలు పరిష్కరించేందుకు మండలం లోని గ్రామాల వారీగా ప్రణాళికబద్దంగా షెడ్యూల్ తయారు చేసుకోవాలని అన్నారు.ముందుగా వచ్చిన అర్జీలకి సంబంధించి రెవిన్యూ రికార్డులు పరిశీలన చేసి జిరాక్స్ లను అర్జీలకి జతపర్చాలని ప్రతి జిరాక్స్ పై సంబంధిత అధికారులు అందరు సంతకం చేయాలని సూచించారు. 

తదుపరి ఎ గ్రామం లోకి అయితే క్షేత్రస్థాయి బృందం పరిశీలనకి వెళ్తున్నారో ఆ రైతులకి ముందుగానే నోటీసులు జారీ చేయాలని సూచించారు.రికార్డులు జత చేసిన అర్జీలను తీసుకొని క్షేత్ర స్థాయి పరిశీలన చేయుటకి వెళ్లాలని, అక్కడే పక్క రైతుల వాంగ్మూలం, పంచనామా చేయాలని సూచించారు.ఏమైనా వాదనలు వినాలనుకంటే అక్కడికడే పరిష్కరించు కోవాలని సూచించారు.ఒకే రకంగా జిల్లా వ్యాప్తంగా చెక్ మెమో తయారు చేసి అన్ని రికార్డ్ లను జతపర్చి అధికారులు అందరు సంతకం చేయాలని తెలిపారు.

గతంలో అర్జిలు తిరస్కరణకి గురైతే మరల అవే వస్తే మరల తిరస్కరణ చేయకుడదని పూర్తి సమాచారం పరిశీలించిన తర్వాతనే పరిష్కరించాలని అలాగే ఒక సర్వే నెంబర్ మీద కోర్ట్ కేసు ఉంటే అదే రైతుకి చెందిన ఇంకో సర్వే నెంబర్ కుడా నిషేధిత జాబితాలో ఉంటుందని వాటిని జాగ్రత్తగా పరిష్కరించాలని తెలిపారు.

భూ భారతి ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజలు ఎంతగానో ఆశతో చూస్తున్నారని రెవిన్యూ శాఖ పరిపాలన లో ముఖ్యమైనదని, వెన్నెముఖ లాంటిదని ప్రజల్లో ఉన్న నమ్మకాని నిజం చేసేలా ప్రతి అధికారి శ్రద్ద పెట్టి భూ సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. విధి నిర్వహణలో ప్రలోభాలకి గురైన, తప్పుడు ఆలోచనలతో విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుంది ఆదేశించారు.

రేషన్ దుకాణాలు తహసీల్దార్లు, రెవిన్యూ ఇన్స్ పెక్టర్ లు తనిఖీ లు చేపట్టి స్టాక్ పరిశీలించాలని, సన్న బియ్యం దుర్వినియోగం కాకుండా ముందు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. వర్ష కాలం కావునా ఆకస్మిక వర్షాలు కురిస్తే గత సంవత్సరం ఆగస్టు చివర్లో కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గంలలో వచ్చిన వరద అనుభవాలు గుర్తించుకొని ఎక్కడైనా సమస్య ఉంటే ముందు జాగ్రత్తగా పరిష్కరించుకోవాలని తెలిపారు.విద్యా సంవత్సరం మొదలు అయినందున విద్యార్థులకి ఆలస్యం కాకుండా కుల, ఆదాయం, రెసిడెన్సీ సర్టిపికెట్లు వెంటనే జారీ చేయాలని సూచించారు.

తదుపరి అదనపు కలెక్టర్ పి రాంబాబు మాట్లాడుతూ అధికారులు నిబద్దతతో పని చేసి భూ సమస్యలు పరిష్కరించాలని అన్నారు. 
బి యల్ ఓ లకి సంబందించిన పేర్లు, ఎపిక్ నెంబర్, ఫోన్ నెంబర్ బ్యాంకు అకౌంట్ వివరాలు మరోసారి పరిశీలించాలని సూచించారు. ఫారం 6,7,8 లు సరైన పద్దతిలో పైలింగ్ చేసుకుంటూ పరిష్కరించాలని తెలిపారు.

ఈ కార్యక్రమం లో ఆర్ డి ఓ లు వేణు మాధవరావు, సూర్యనారాయణ,కలెక్టరేట్ పరిపాలన అధికారి సుదర్శన్ రెడ్డి,సూపర్టీడెంట్లు,డిప్యూటీ తహసీల్దార్ లు, ఆర్ఐ లు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్

ఈరోజు భారతీయ జనతా పార్టీ పూర్వపు భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకులు అయినటువంటి డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ సందర్భంగా హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కార్యక్రమంలో హుజూర్ నగర్ పట్టణ అధ్యక్షులు కొండ హరీష్ గౌడ్ వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు కొండ హరీష్ గౌడ్ మాట్లాడుతూ డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి జీవిత విశేషాలను తెలియజేస్తూ దానిలో భాగంగా స్వతంత్ర భారత్ లో కశ్మీర్ విషయంలో ఆనాటి ప్రధానమంత్రి జవహార్ లాల్ నెహ్రూ గారు 'లియాకత్ అలీ-నెహ్రూ' అనే ఒప్పందం ద్వారా జమ్మూ కాశ్మీర్ కు స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వాలి అనే నిర్ణయానికి వ్యతిరేకంగా డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారు "ఏక్ దేశమే దో విధాన్ దో ప్రధాన్ దో నిషాన్ నహీ చలేగా" అని పిలుపునిచ్చి వారు కాశ్మీర్ పర్యటనకు వెళ్లడం జరిగింది. ఆ సమయంలో అక్కడ వారిని అక్రమంగా నిర్బంధించి వారు చనిపోవడానికి ఆనాటి ప్రభుత్వం కారణమైందని వారు తెలిపారు. అలా ఈ దేశం కోసం ఈ దేశ ఐక్యత కోసం ప్రాణాలర్పించినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు దేనుమకొండ రామరాజు, జనిగల శ్రీను, టౌన్ కన్వీనర్ నాగేంద్ర చారి, టౌన్ ప్రధాన కార్యదర్శి గుండా గోపి మరియు బూత్ అధ్యక్షులతో స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

మనభూమి వార్త

హుజూర్ నగర్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

​హుజూర్ నగర్, మార్చి 7, 2026: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని బాలాజీ ఫంక్...

ఎక్కువమంది చూసినా వార్త