Saturday, November 1, 2025

గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు రఘునాథ పాలెం సిఐ ఖమ్మం జిల్లా

ఖమ్మం జిల్లా రఘునాథ పాలెం లోని ఆపిల్ సెంటర్ లో ఈ రోజున ఖమ్మం పోలీస్ కమీషనర్ ఆదేశాల మేరకు ఖమ్మం టౌన్ ఏసీపీ పర్యవేక్షణలో వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక అనుమానస్పద వాహనంలోని ఇద్దరు వ్యక్తుల నుండి 30 లక్షల విలువ గల హషీష్ ఆయిల్ (గంజాయి ఆయిల్), వాహనాన్ని సీజ్ చేసి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగింది. ఈ కార్యక్రమం లో రఘునాథపాలెం ఇన్స్పెక్టర్ ఉస్మాన్ షరీఫ్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ గజ్జెల నరేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు

మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో నేటి నిత్యభిషేకాలు, నిత్య హోమాలు

​శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం, మట్టపల్లి మహాక్షేత్రం నందు ఈ రోజు శ్రీ స్వామి వారికి ఉదయం నిత్యాభిషేకములు, నిత్య హోమములు శాస్త్రోక్తంగా నిర్వహించబడినవి; కార్తీక మాస పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం నందు సైతం శ్రీ స్వామివారికి ప్రత్యేక అభిషేకములు, విశేష అర్చనలు జరిగాయి. వీటితో పాటుగా, దేవాలయ అర్చకులు తూమాటి కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహ మూర్తి, ఆంజనేయాచార్యులు వార్లచే 'నిత్య కళ్యాణం' మరియు సత్యనారాయణ స్వామి వ్రతములు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించబడినవి. ఈ సందర్భంగా దేవాలయం అన్నదానం కార్యక్రమంలో మొత్తం 210 మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ జరిగినది..

మనభూమి వార్త

హుజూర్ నగర్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

​హుజూర్ నగర్, మార్చి 7, 2026: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని బాలాజీ ఫంక్...

ఎక్కువమంది చూసినా వార్త