Sunday, June 15, 2025

రేపు ఏసీబీ ఎదుట హజరుకానున్న కేటీఆర్.. గులాబీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ.

తెలంగాణలో రాజకీయాలు వర్షకాలంలో హీట్ ను పుట్టిస్తున్నాయి. ఒక వైపు బీఆర్ఎస్ అక్రమ పాలన వల్ల తెలంగాణ పదేళ్లు వెనక్కుపోయిందని సీఎం రేవంత్ ఆరోపిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ .. కాంగ్రెస్ కు ఎన్నికల వేళ ఇచ్చిన హమీలను నెరవేర్చడం చాతకాక.. బీఆర్ఎస్ శ్రేణులపై అక్రమ కేసులు బనాయిస్తుందంటూ కౌంటర్ లు ఇస్తున్నారు. దీంతో కాంగ్రెస్ , బీఆర్ఎస్ ల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి.

తెలంగాణలో రికార్డు .. ఆర్టీసీలో మహిళ డ్రైవర్

మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. అన్ని రకాల ఉద్యోగాలు చేస్తున్నారు. అన్ని రకాల ఆటలు ఆడుతున్నారు. అన్ని రకాల పదవులు నిర్వహిస్తున్నారు. అన్ని రకాల వాహనాలు నడుపుతున్నారు. విమానాలు కూడా నడుపుతున్నారు. భారీ వాహనాలు కూడా నడుపుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వారు చేయలేని పనిలేదు. కాని ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సులు నడిపిన మహిళలు కనబడలేదు. ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు.

విమానాలు నడిపే మహిళలకు ఆర్టీసీ బస్సు నడపడం కష్టం కాదు. ఆర్టీసీలోని ఇతర విభాగాల్లో మహిళలు పనిచేస్తున్నారు. మహిళా కండక్టర్లను మనం చూస్తూనే ఉన్నాం కదా. కాని ఎందుకో ఇప్పటివరకు డ్రైవర్లుగా వారిని నియమించలేదు. కాని ఇప్పుడు ఆ లోటు కూడా తీరిపోయింది. తెలంగాణ ఆర్టీసీలో తొలిసారిగా మహిళా డ్రైవరును నియమించారు. తాజాగా.. తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా బస్ డ్రైవర్ సరిత అనే మహిళ రికార్డు సృష్టించింది. ఆమె నిన్ననే డ్యూటీలో జాయిన్అయింది.

మొదటి రోజు హైదరాబాద్ నుంచి మిర్యాలగూడకు ఆర్టీసీ బస్ నడిపింది. ఇన్నిరోజులు దేశ రాజధాని ఢిల్లీలో డ్రైవర్గా విధులు నిర్వర్తించిన సరిత ప్రత్యేక అనుమతితో తెలంగాణ ఆర్టీసీలో చేరింది. అక్కడ ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో డ్రైవరుగా పనిచేసింది. గతంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా దేశంలో మొట్టమొదటి మహిళా డ్రైవర్గా అవార్డు తీసుకుంది సరిత. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సీత్యాతండాకు చెందిన వి.రాంకోటి, రుక్కల కుమార్తె సరిత... మీ గూడచారి

ప్రైవేట్ పాఠశాలు విద్యార్థి చదువు కోసం కాదు బుక్స్ నోట్స్ అమ్మడానికి కోసం మాత్రమే

 

హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ చైతన్య టెక్నో హైస్కూల్ లో విద్యార్థి సంఘాల నాయకులకు పాఠశాల యాజమాన్యం మధ్య వివాదం.

హుజూర్ నగర్ శ్రీ చైతన్య టెక్నో హైస్కూల్ లో  ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా బుక్స్ నోట్స్ యూనిఫామ్ అంటూ తల్లిదండ్రుల నుండి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని డి వై ఎఫ్ ఐ విద్యార్థి సంఘం నాయకులకు ఫిర్యాదు అందడంతో డి వై ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి బోయిళ్ళ నవీన్ స్థానిక ఎంఈఓ కి సమాచారం ఇచ్చినా ఆయన అందుబాటులో లేకపోవడంతో  అడిగేందుకు పాఠశాలకు వెళ్ళగా సరైన సమాధానం రాకపోవడంతో పాఠశాల యాజమాన్యం విద్యార్థి సంఘం నాయకులను బెదిరింపులకు గురి చేసేలా వీడియోలు తీస్తూ మాటలు జారడంతో ఇరువురి మధ్య ఘర్షణ వాతావరణ నెలకొంది.ఇట్టి విషయంలో హుజూర్నగర్ స్థానిక పోలీస్ లు రంగ ప్రవేశం చేయడంతో ఇరువర్గాలను నచ్చజెప్పి విద్యార్థి సంఘం నాయకులను అక్కడ నుంచి పంపించినట్లు సమాచారం. ఇట్టి విషయంలో మండల విద్యాధికారి మరియు జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా కలెక్టర్ స్పందించి ప్రతి పాఠశాలను తనిఖీ చేసి ప్రభుత్వ పుస్తకాలను మాత్రమే విద్యార్థులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు

ఏమైంది మన హుజూర్ నగర్ కి

 


:::ఏమైంది మన హుజూర్ నగర్ కి:::

కలకలలాడుతున్న మన హుజూర్ నగర్ లో  ఏదో తెలియని ఇబ్బందులు ఎదురయ్యాయని తెలుస్తుంది నెలలో 15 నుంచి 20 మంది దాకా యువకుల మరణం కొత్తగా పెళ్లయిన భార్య భర్తలు విడాకుల దాకా పోవడం దంపతులకు సంతానలేమి, తండ్రి కొడుకుల గొడవలు, వృద్ధుల అనాధలు, అన్నదమ్ముల ఆస్తి గొడవలు లేవు ఎందుకు ఇట్లా జరుగుతుందని ఎవరికైనా తెలుసా దీనికి కారణం ఏంటో ఎవరన్నా గుర్తించారా యువకులు మరణం హుజూర్ నగర్ అడ్డ రోడ్డు నందు మరియు శాంతి స్తూపం నందు రోజుకొక చనిపోయిన వాల్ పోస్టర్లు అతికించడం అందులో యువకులు ఉండడం నాకు కంటతడిని పెట్టించాయి హుజూర్ నగర్లో  ఎందరో వచ్చి అభివృద్ధి చేద్దామనుకున్నా గానీ చేయలేకపోకపోవడం దానికి అడ్డంకులు రావడం దీనికి కారణం ఏమిటో గుర్తించారా ఎందుకంటే అన్ని ఊర్లలో "బొడ్డు రాయి" ఆ ఊరికి నడి బొడ్డుగా ఒకటి ఉంటుంది ఆ బొడ్డు రాయి దేవతగా దేవుడుగా పూజిస్తారు మన పూర్వీకుల నమ్మకం ఏమిటంటే ఆ బొడ్రాయి ఎవరైనా వెళ్లేటప్పుడు ఆ బొడ్రాయిని వెంట గాని ఆ బోర్డర్ దారిలో గాని వెళ్ళినట్లయితే అందరికీ సకల శుభాలను కలుగుతాయని బొడ్రాయి చూసినప్పుడు సకల శుభాలు కలుగుతాయని తరతరాల విలువ వస్తున్న నమ్మకం ఊరిని కాపాడుతుందని దానిని ఎప్పుడు పూజిస్తూ దానిని బొడ్రాయిని కొలుచుకునే వాళ్లు అలాంటి మన హుజూర్ నగర్ ఇప్పటివరకు పట్టించుకోకపోవడం మన మూర్ఖత్వం ఆ బొడ్డు రాయి ఈ దేవత దేవుళ్లను పట్టించుకోకపోవడం మనకి మంచిది కాదు అని కొంతమంది పెద్దల అభిప్రాయం దానివల్లనే ఇటువంటి కష్టాలు వస్తున్నాయని భార్యాభర్తలు పచ్చటి కాపురంలు కూలిపోతున్నాయని విడిపోతున్నారని మరియు పెద్ద కుటుంబాలు కూడా విడిపోతున్నాయని మన హుజూర్నగర్ పెద్దల అభిప్రాయం కాబట్టి యువకుల్లారా మేల్కోండి. పెద్దలారా ఆలోచించండి. మన హుజూర్నగర్ లో ఉన్న బొడ్రాయిని ఇప్పటికైనా మీరు గ్రహించి దానికి పూజలు చేసి మట్టిలో పూడిపోయిన బొడ్డు రాయిని బయటికి తీసి దానికి పూజలు చేసి బొడ్డు రాయిని నిలపాలని తమరి కోరుకుంటున్నాను ప్రజలను తమ్ముళ్లను అన్నలను అందర్నీ ఆలకించి అలాంటి దుస్థితి మన ఇంటికి చిరకుండా మన వంతు సాయంగా మన వంతు ప్రయత్నం గా మన మన ఊరి బొడ్డు రాయి సమస్యను తీర్చాలని పెద్దమనుషులను మన హుజూర్ నగర్ శాసనసభ సభ్యులు ఉత్తంకుమార్ రెడ్డి ని గారిని కోరుకుంటున్నాను... మీ గూడచారి

హుజూర్ నగర్ పట్టణ బిజెపి నూతన కమిటీని


హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు *పట్టణ అధ్యక్షులు కొండ హరీష్ గౌడ్* అధ్యక్షతన పట్టణ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో భాగంగా అధ్యక్షులు పట్టణ బిజెపి కమిటీని ప్రకటించడం జరిగింది. 

*పట్టణ బిజెపి కమిటీ*

ఉపాధ్యక్షులు: విజయ్ పైడమర్రి, కొల్లోజు నాగేంద్ర చారి.

జనరల్ సెక్రెటరీ: గుండా గోపి,

కార్యదర్శులు: గుగులోతు రవి, చుక్కా హరీష్,

కార్యవర్గ సభ్యులు: యల్లావుల సోమరాజు, పంగా రమేష్, బైరు సతీష్, బల్వంత్ సింగ్, పులి నరసింహ, బత్తుల ఉపేందర్, గుండా నాగరాజు, కామళ్ళ వంశీ, అయిల సిసింద్రీ, రంగనాథ్ నియమించడం జరిగింది.

    ఈ కమిటీ తక్షణం అమల్లోకి వస్తుందని అధ్యక్షులు తెలిపారు. అలాగే ఈ సమావేశంలో *భారతీయ జనతా పార్టీ టౌన్ అధ్యక్షులు కొండా హరీష్ గౌడ్* మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి కార్యకర్త కూడా పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం కృషి చేయాలని అలాగే పార్టీ ఇచ్చినటువంటి భవిష్యత్తు కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని కోరారు. అలాగే రాబోయేటువంటి మునిసిపల్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అన్ని వార్డ్ లలో పోటీ చేస్తుందని అలాగే రాష్ట్రంలో అధికార పార్టీ మరియు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యాయని, అదే విధంగా భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే అని తెలిపారు. అందుకు ప్రతి ఒక్క కార్యకర్త కూడా కృషి చేయాలని కోరారు.

మనభూమి వార్త

హుజూర్ నగర్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

​హుజూర్ నగర్, మార్చి 7, 2026: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని బాలాజీ ఫంక్...

ఎక్కువమంది చూసినా వార్త