Sunday, October 12, 2025

సామాన్య బాధితుల సేవ సంఘం రాష్ట్ర మరియు జిల్లా కార్యవర్గ సభ్యుల సమావేశం

సామాన్య బాధితుల సేవ సంఘం (SBSS), ఖమ్మం జిల్లా.. 
ఖమ్మం జిల్లాలోని సామాన్య బాధితులకు న్యాయం అందించడంలో అండగా ఉండడం కోసం మరియు భరోసా అందించే లక్ష్యంతో పని చేసుకోవడం కోసం సేవలందించడం కోసం సామాన్య బాధితుల సేవ సంఘం (SBSS), జిల్లా కార్యాలయం ఏర్పాటుపై ఇటీవల కీలక సమావేశం నిర్వహించింది.
సంఘం రాష్ట్ర అధ్యక్షులు కూరపాటి నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి, జిల్లా అధ్యక్షులు, లీగల్ అడ్వైజర్ మరియు కార్యవర్గ సభ్యులు అందరూ కలిసి ఒకే చోట సమావేశమయ్యారు.

తెలంగాణ అధ్యక్షులు కూరపాటి నాగేశ్వరావు మాట్లాడుతూ ఎందరో బాధితులు
దూర ప్రాంతాల నుండి, అలాగే జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే బాధితులకు ఇబ్బందులు పడకుండా త్వరగా సులభంగా అందుబాటులో ఉండే విధంగా, ఖమ్మం జిల్లా కేంద్రంగా కార్యాలయాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని సమావేశంలో చర్చించారు. ఈ కార్యాలయం ద్వారా బాధితులకు న్యాయం అందించడం, వారికి అండగా ఉండటం మరియు సంఘం యొక్క సేవా కార్యక్రమాలను పటిష్టంగా నిర్వహించడం లక్ష్యంగా పెట్టుకున్నారనీ అన్నారు
కార్యాలయం ఏర్పాటు కోసం స్థలం కేటాయింపు ప్రక్రియలో జరుగుతున్న జాప్యంపై సభ్యులు తీవ్రంగా చర్చించారు. ఈ ఆలస్యాన్ని నివారించి, కార్యాలయ ఏర్పాట్లను వేగవంతం చేయడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
సమావేశం జరిగిన నాలుగు రోజుల తర్వాత, సంఘం ప్రతినిధి బృందం ఖమ్మం అర్బన్ తాసిల్దార్ గారిని కలిసి, కార్యాలయ స్థలం కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ మరొక వినతి పత్రాన్ని సమర్పించలని బాధితుల సంఘం తరఫున ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవడం కోసం పాటుపడాలని నాయకులు విజ్ఞప్తి చేశారు.
సామాన్య బాధితులకు సేవలందించేందుకు కార్యాలయాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకురావడానికి సంఘం కృషి చేస్తామని నాయకులు తెలియజేశారు.
ఇట్టి కార్యక్రమంలో సామాన్య బాధితుల సేవ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కూరపాటి నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొల్లోజు నాగేంద్ర చారి, ఖమ్మం జిల్లా అధ్యక్షులు శీలం రామకృష్ణారెడ్డి లీగల్ అడ్వైజర్ ధరావత్ ప్రసాద్  యాస నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

మనభూమి వార్త

హుజూర్ నగర్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

​హుజూర్ నగర్, మార్చి 7, 2026: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని బాలాజీ ఫంక్...

ఎక్కువమంది చూసినా వార్త