Saturday, June 21, 2025

అంతర్జాతీయ యోగా డే_ బి.జే.పి హుజూర్ నగర్ పట్టణ అధ్యక్షులు కొండా హరీష్ గౌడ్

ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ హుజూర్ నగర్ పట్టణ అధ్యక్షులు కొండా హరీష్ గౌడ్ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో పదవ అంతర్జాతీయ యోగ దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణ అధ్యక్షులు కొండా హరీష్ గౌడ్ మాట్లాడుతూ యోగా అనేది సుమారుగా 5000 సంవత్సరాల క్రితం భారతదేశంలో మహర్షి పతంజలి గురువుగారు ద్వారా పరిచయమైందని తెలిపారు. ప్రపంచ దేశాలకు యోగ ను అందించిన ఘనత భారతదేశానిది మాత్రమే అని తెలిపారు. 'వన్ ఎర్త్-వన్ హెల్త్' అనే నినాదంతో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత యోగ ను ప్రపంచ దేశాలకు పరిచయం చేసి 2015 జూన్ 21న అంతర్జాతీయ యోగ దినోత్సవం గా ప్రకటించేందుకు చాలా కృషి చేశారని తెలిపారు. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు యోగ ను అనుసరిస్తున్నాయని తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా యోగ ను వారి జీవనశైలిలో ఒక భాగంగా మార్చుకోవాలని అదేవిధంగా యోగ చేయడం వలన ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులంగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యోగ డే పట్టణ కన్వీనర్ పైడిమర్రి విజయ్, పట్టణ ప్రధాన కార్యదర్శి గుండా గోపి, జిల్లా నాయకులు కుందూరి కోటిరెడ్డి, కంటు నాగరాజు, జనార్దన్ రెడ్డి, గుండా నాగరాజు, రంగనాథ్, బల్వంత్ సింగ్, జగన్ మరియు పాఠశాల విద్యార్థులతో పాటు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మనభూమి వార్త

హుజూర్ నగర్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

​హుజూర్ నగర్, మార్చి 7, 2026: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని బాలాజీ ఫంక్...

ఎక్కువమంది చూసినా వార్త