Thursday, June 19, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

పిల్లుట్ల లింగయ్యను హుజూర్ నగర్ నియోజకవర్గ అధ్యక్షునిగా జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక పార్టీ నియమించింది.

జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక పార్టీ హుజూర్ నగర్ నియోజకవర్గఅధ్యక్షునిగా పిల్లుట్ల లింగయ్య నియామకం.

నియామక పత్రం అందజేసిన పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు,తెలంగాణ రాష్ట్ర పార్టీ ఇంచార్జ్ పిల్లలు మర్రి వెంకటేశ్వర్లు

మీ టీవీ గూడచారి ... హుజూర్ నగర్ జూన్ 19

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక పార్టీ కార్యాలయంలో గురువారం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర పార్టీ ఇంచార్జ్ పిల్లలు మర్రి వెంకటేశ్వర్లు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ అధ్యక్షుడు గా సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం తాళ్ల మర్కాపురానికి చెందిన పిల్లుట్ల లింగయ్యను నియమిస్తూ నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు మాట్లాడుతూ చేతివృత్తులపై ఆధారపడి జీవిస్తున్న కులాలను ఏకం చేసి వారిని రాజకీయంగా ఎదుగుదలకు ప్రోత్సహించి నియోజకవర్గం లోని ప్రతి గ్రామ గ్రామాన మండల స్థాయిలో మరియు నియోజకవర్గ స్థాయిలో అన్ని ఎలక్షన్లలో పోటీ చేసేలా సిద్ధం చేయాలని ఎస్సి, ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు రాజ్యాధికారం దక్కిన కృషి చేయాలని పార్టీ నియమ నిబంధనలు పాటిస్తూ పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు సాగాలని కోరారు అనంతరం పిల్లుట్ల లింగయ్య మాట్లాడుతూ తనపై నమ్మకంతో హుజూర్ నగర్ నియోజకవర్గ అధ్యక్షుడిగా నియమించిన జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక పార్టీ అధ్యక్షులు అవ్వారి మల్లికార్జున్ మరియు పార్టీ నాయకులకు పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు పిల్లలు మర్రి వెంకటేశ్వర్లు కు కృతజ్ఞతలు తెలియజేశారు.

వారంరోజుల్లో సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ రావచ్చు...*

*వారంరోజుల్లో సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ రావచ్చు...* 

 *కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండండి...* 

 *తన స్వంత నియోజకవర్గంలోని కొత్తగూడ మండల పర్యటనలో మంత్రి సీతక్క...*

*ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎస్సైలు బదిలీలు*

*నల్లగొండ జిల్లా :-*
*హాలియా SI గా పనిచేస్తున్న సతీష్ రెడ్డి కి సీఐ గా ప్రమోషన్ రావడం తో హాలియా సీఐ గా సతీష్ రెడ్డి నియామకం*,
• *హాలియా సీఐ గా పనిచేస్తున్న జనార్దన్ గౌడ్ IG ఆఫీస్ కి అటాచ్* 
• *హాలియా SI గా తిప్పర్తి లో పని చేస్తున్న సాయి ప్రశాంత్ బదిలీ* 
• *త్రిపురారం లో పని చేస్తున్న SI ప్రసాద్ పెద్దవూర కి బదిలీ* 
• *హుజుర్నగర్ లో పనిచేస్తున్న SI ముత్తయ్య నాగార్జున సాగర్ కి బదిలీ* 
• *మిర్యాలగూడ షీ టీమ్ లో పని చేస్తున్న SI నరేష్ త్రిపురారం కి బదిలీ* 
• *సాగర్ SI సంపత్,పెద్దవూర SI వీరబాబు, నల్లగొండ వీఆర్ కి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఐజీ సత్యనారాయణ*

శ్రీ రాహుల్ గాంధీ జన్మదినం ఇందిరా సెంటర్ లో కేకు కట్ చేసిన కాంగ్రెస్ నాయకులు

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదిన శుభసందర్భంగా ఇందిరా సెంటర్ లొ భారీ కేకు కట్ చేసి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్న హుజుర్నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జునరావు గారు మరియు హుజుర్నగర్ మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ గార్కి హుజుర్నగర్ ముస్లిం మైనార్టీ నియోజకవర్గం అధ్యక్షులు షైక్ సైదా గారు మరియు హుజుర్నగర్ గౌడ సొసైటీ అధ్యక్షులు వల్లపుదాసు కృష్ణ గౌడ్ కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేసారు ఈ కార్యక్రమం లొ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటున్నట్టు తెలియజేశారు.

మనభూమి వార్త

హుజూర్ నగర్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

​హుజూర్ నగర్, మార్చి 7, 2026: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని బాలాజీ ఫంక్...

ఎక్కువమంది చూసినా వార్త