Saturday, June 28, 2025

రానున్న ఎన్నికల్లో డబుల్ ఇంజన్ సర్కార్ ఖాయం..

రానున్న ఎన్నికల్లో డబుల్ ఇంజన్ సర్కార్ ఖాయం..
.. మోడీ సర్కార్ పై విశ్వాసంతో పిఎసిఎస్ వైస్ చైర్మన్ ఆయన అనుచరులు భాజపాలు చేరిక..
మంజులాపూర్ పిఎసిఎస్ వైస్ చైర్మన్ కడ్తాల్ గ్రామానికి చెందిన బర్మా గంగా దాస్ ఆయన అనుచరులు ఆదివారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే, భాజపా శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు ఆకర్షితులవుతున్నారని ఈ మేరకు పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. భాజపా దేశ సమగ్రతకు, సమైక్యతకు అభివృద్ధి సంక్షేమ రంగాల్లో చేపడుతున్న అనేక కార్యక్రమాల పట్ల ప్రజలకు అత్యంత నమ్మకం కుదిరిందని అందులో భాగంగానే గంగా దాస్ , ఆయన అనుచరులు పార్టీలో చేరారని వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించామని అన్నారు. రానున్న ఎన్నికల్లో అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ డబుల్ ఇంజన్ సర్కార్ జయకేతనం ఎగరేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి నెరవేర్చడం లేదని అన్నారు. గత పంట కాలంలో 40 లక్షల మంది రైతుల ఖాతాలో రైతు భరోసా కింద జమ చేయాల్సిన పెట్టుబడి సాయం 25 లక్షల మందికే పరిమితం చేసిందని, మరో 15 లక్షల మందికి ఎగ్గొట్టిందని కాంగ్రెస్ పార్టీ విధానాలను ఘాటు గా విమర్శించారు. దరఖాస్తులకు అనుగుణంగా రేషన్ కార్డులు, పింఛన్లు అందజేయడం లేదని దీంతో కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు విశ్వాసం పోయిందని అన్నారు. ప్రభుత్వ ఖజానాలో నిధులు లేవని, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం లేదని ఆయన విమర్శించారు
. కార్యక్రమంలో నిర్మల్ ఉమ్మడి మండల పరిషత్ మాజీ అధ్యక్షులు భాజపా నాయకులు వి. సత్యనారాయణ గౌడ్, రాష్ట్ర నాయకులు రావుల రామ్నాథ్, ముత్యం రెడ్డి, జమాల్ తదితరులు పాల్గొన్నారు.
#alletimaheshwarreddy #nirmalmla #bjlpleader #BJPTelangana

ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ పై మేము తయారు చేయించిన వీడియో సాంగ్.. సార్ చేతుల తో ఆవిష్కరణ

*ఈరోజు భారీ నీటిపారుదల మరియు పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మేము తయారు చేయించిన వీడియో సాంగ్ సార్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగినది*
ఈ యొక్క సాంగ్ కి సహకరించిన 

జక్కుల గురవయ్య యాదవ్ గారు 
ముడావత్ కొండ నాయక్ గారు
మాలోత్ సక్రు నాయక్ గారు
గుంటక కరుణాకర్ రెడ్డి గారు 
మట్టపల్లి రవీందర్ గారు
చింతకాయల వెంకన్న గార్లకు పేరుపేరునా ధన్యవాదాలు 

ఇట్లు.. మీ కుక్కల నాగరాజు

నోట్:- సాంగ్ యో యో యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు వస్తుంది లింకు రాగానే మీ అందరికీ షేర్ చేస్తాను

పాములపర్తి వెంకట నరసింహారావు” జయంతి

తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీక, తెలుగుజాతి తేజస్సు, ఆర్థిక సంస్కరణల ద్వారా దేశ దశ–దిశలను మార్చిన యుగపురుషుడు, బహుభాషా కోవిదుడు మన తెలుగు వారికి ఆదర్శదైవం — ఆయనే పాములపర్తి వెంకట నరసింహారావు. తెలుగు రాష్ట్రం నుండి ప్రధాని పదవిని అధిష్ఠించిన ఏకైక తెలుగు వ్యక్తి.

ఆర్థిక సంక్షోభంలో ఉన్న భారతదేశాన్ని ధైర్యంగా ముందుకు నడిపించి, సంస్కరణల బాటలో నిలిపిన మహనీయుడు. మెజారిటీ లేకున్నా, తన దార్శనికతతో ఐదేళ్లపాటు స్థిరంగా పాలన అందించి, దేశ ఆర్థిక విధానాల్లో మూల ప్రణాళికలు అమలు చేసిన గొప్ప మేధావి. ఆయన తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు దేశానికి దిక్సూచి అయ్యాయి.

భారతరత్న “పాములపర్తి వెంకట నరసింహారావు” జయంతి సందర్భంగా ఈ మహనీయుడిని స్మరించుకోవడం తెలుగు ప్రజలందరికి గౌరవకరమైన క్షణం. తెలుగుజాతికి ప్రాతఃస్మరణీయుడుగా, చిరస్మరణీయుడిగా నిలిచే నరసింహారావు గారు దేశానికి ప్రేరణగా నిలిచారు. ఆయన సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి.

"కవితారసపుజల్లు,
ఖడ్గాల గలుగల్లు,
కరణాలకే చెల్లు,
ఓ కూనలమ్మా !!"

తెలుగుతేజం 
కీర్తి శేషులు
శ్రీ పాములపర్తి వెంకట నరసింహారావు గారి జయంతి సందర్భంగా
మనః పూర్వక నివాళి !!

*హుజూర్‌నగర్ ఎమ్మార్వో కార్యాలయంలో ఏసీబీ సోదాలు*..

*సూర్యాపేట జిల్లా *హుజూర్‌నగర్ ఎమ్మార్వో కార్యాలయంలో ఏసీబీ సోదాలు*..
*భూమి మ్యుటేషన్ విషయంలో డబ్బులు డిమాండ్ చేసిన ధరణి ఆపరేటర్ విజేత రెడ్డి*...
*20 వేలు డిమాండ్ చేయగా చివరకు 12 వేలు తీసుకునేందుకు అంగీకారం*
*ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు*
*బాధితుడి నుంచి‌ రూ. 12 వేలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు*...

మనభూమి వార్త

హుజూర్ నగర్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

​హుజూర్ నగర్, మార్చి 7, 2026: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని బాలాజీ ఫంక్...

ఎక్కువమంది చూసినా వార్త