హైదరాబాద్, జూలై 4, 2025: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపు మేరకు, ఈరోజు హుజూర్‌నగర్ నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియానికి బయలుదేరారు. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ఈ సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎండి. అజీజ్ పాషా మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. సన్న బియ్యం పథకం, ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, రైతన్నలకు రైతు భరోసా పథకం వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని ఆయన అన్నారు.
"జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్" కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న ఈ సభ గ్రామ, పట్టణ స్థాయి కాంగ్రెస్ నాయకుల, కార్యకర్తల సమ్మేళనం.
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి సమ్మెట సుబ్బరాజు, బ్లాక్ కాంగ్రెస్ కార్యదర్శి బొడ్డు గోవిందరావు, మండల పార్టీ ఉపాధ్యక్షులు చిన్నం శ్రీనివాస్, మూడో వార్డు ఇంచార్జ్ గంజి శివ, ఎన్.ఎస్.ఇవై పట్టణ అధ్యక్షులు ఎస్కే ముస్తఫా, సోషల్ మీడియా మోహన్ ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా గ్రామ స్థాయి మరియు పట్టణ స్థాయి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పార్టీ పిలుపునిచ్చింది.