Saturday, December 6, 2025

రేవూరు 12వ వార్డు అభ్యర్థిగా కొమ్ము మహేష్ (బీటెక్) నామినేషన్ దాఖలు

 


రేవూరు 12వ వార్డు అభ్యర్థిగా కొమ్ము మహేష్ (బీటెక్) నామినేషన్ దాఖలు

 

మన భూమి వార్త: సూర్యాపేట జిల్లా మేళ్లచేర్వు మండలం రేవూరు గ్రామ పంచాయతీ వార్డు ఎన్నికలు, రేవూరు 12వ వార్డు అభ్యర్థిగా కొమ్ము మహేష్ (బీటెక్) నామినేషన్ దాఖలు, సూర్యాపేట జిల్లా, మేళ్లచేర్వు మండలం, రేవూరు గ్రామ పంచాయతీ పరిధిలోని 12వ వార్డుకు గాను, కూటమి తరపున వార్డు సభ్యులు అభ్యర్థిగా కొమ్ము మహేష్ (బీటెక్) శుక్రవారం నాడు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ సందర్భంగా కొమ్ము మహేష్ సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ... "12వ వార్డులో నివసిస్తున్న గౌరవనీయ ఓటర్లందరూ నా విజయం కోసం సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేవూరు గ్రామ పంచాయతీకి నిస్వార్థంగా సేవ చేసే అదృష్టాన్ని నాకు కల్పించాలని అభ్యర్థిస్తున్నాను. వార్డు అభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తాను. మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరుతున్నాను." అని విజ్ఞప్తి చేశారు.

కొమ్ము మహేష్ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు ఆయన మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వార్డు ఎన్నికల్లో కొమ్ము మహేష్ గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.


మనభూమి వార్త

హుజూర్ నగర్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

​హుజూర్ నగర్, మార్చి 7, 2026: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని బాలాజీ ఫంక్...

ఎక్కువమంది చూసినా వార్త