కుటుంబ పోషణకు అప్పుల పాలవుతున్నాం
ఐదు నెలల జీతం చెల్లించేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలి
హుజూర్ నగర్ ఏరియా హాస్పిటల్
నందు ఔట్సోర్సింగ్ ఏజెన్సీ కార్మికులు ఐదు నెలలుగా జీతాలు లేక ఇబ్బందులకు గురవుతున్నారని ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు నెలనెలా జీతాలు వేస్తున్న ప్రభుత్వం, మాకు మాత్రం శ్రమకు తగ్గ వేతనం ఇవ్వక పోయినా కుటుంబ పోషణ కోసం వెట్టి చాకిరి చేస్తున్న తమకు ప్రభుత్వం ప్రతి నెల బిల్లులు చెల్లించకుండా ఐదు నెలలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.కుటుంబ పోషణకు అప్పుల పాలవుతున్నామని ఇప్పటికైనా సూర్యాపేట జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే బిల్లులు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని కార్మికుల కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యశాఖ, రెవిన్యూ మున్సిపల్, వివిధ శాఖల అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు.