Saturday, August 30, 2025
*ఆస్పత్రిలో రౌండ్స్ వేస్తుండగా.. గుండెపోటుతో కార్డియాక్ సర్జన్ మృతి*
ఈ బ్లాగులో, మేము కేవలం వార్తలను అందించడం కాకుండా, వాటి వెనుక ఉన్న కథలను, దాగి ఉన్న కారణాలను, మరియు భవిష్యత్ పరిణామాలను విశ్లేషిస్తాం. రాజకీయాలు, సాంకేతికత, సామాజిక అంశాలు, చరిత్ర, మరియు ఇంకా ఎన్నో రంగాలలో "గూఢచారి" వలె పరిశోధించి, మీకు ఆసక్తికరమైన మరియు ఆలోచింపజేసే కంటెంట్‌ను అందిస్తాం.
పి.రాంబాబు పదవీ విరమణ సన్మాన కార్యక్రమం
శేష జీవితం ఆయురారోగ్యలతో, సుఖ సంతోషాలతో కుటుంబ సభ్యులతో గడపాలి
- shaik Saida
- 9:12 PM


ప్రభుత్వ అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాల అమలులో ఉద్యోగుల బాధ్యత అతి కీలకమని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు.శనివారం సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలో సమావేశ మందిరంలో నిర్వహించిన అదనపు కలెక్టర్ డాక్టర్ పి.రాంబాబు పదవీ విరమణ సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు 1995 లో డిప్యుటీ తహసీల్దార్ గా ప్రయాణం మొదలు పెట్టి గత 7 సంవత్సరాలుగా అదనపు కలెక్టర్ గా కుటుంబ సభ్యుల సహకారంతో, నిబద్దత తో విధులు నిర్వహిస్తూ లక్షలాది మంది ప్రజలకి సేవ చేయటం చాలా అభినందనీయమని జిల్లా కలెక్టర్ కొనియాడారు. సంక్షేమ పథకాలలో ముఖ్యమైనవి హుజూర్ నగర్ నుండి సన్న బియ్యం పంపిణి, తిరుమలగిరి నుండి రేషన్ కార్డుల పంపిణీ పథకాలు అదనపు కలెక్టర్ సహకారంతో జిల్లాలో విజయవంతం చేశామని అన్నారు. అదనపు కలెక్టర్ ని సమన్వయము చేసుకుంటూ గత యాసంగి ధాన్యం కొనుగోలు సమయంలో ఆకస్మిక వర్షాలు కురిసిన రైతులకి ఇలాంటి ఇబ్బంది కలగకుండా ధాన్యం సేకరించామని అలాగే సీ ఎం ఆర్ డెలివరీ లు కుడా వేగవంతంగా పూర్తి చేయటం జరిగిందని తెలిపారు.భూ భారతి చట్టం అమలులో భాగంగా జిల్లా వ్యాప్తంగా క్షేత్ర స్థాయి లో పర్యటనలు చేసి భూ సమస్యలు పరిష్కరించటంలో ఎంతగానో కృషి చేశారు.మిగిలిన శేష జీవితం ఆయురారోగ్యలతో, సుఖ సంతోషాలతో కుటుంబ సభ్యులతో గడపాలని కోరుకుంటున్నాని జిల్లా కలెక్టర్ ఈ సందర్బంగా తెలిపారు పదవి విరమణ పొందుతున్న జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు తన అనుభవాలు స్మరించుకుంటూ జీవితంలో కష్టే ఫలి అని నమ్మి డిప్యుటీ తహసీల్దార్ గా మొదలైన ప్రయాణం గత 7 సంవత్సరాలుగా ఐదు జిల్లాలలో అదనపు కలెక్టర్ గా విధులు నిర్వహించానని, నా జీవితం లో 26 కలెక్టర్ల వద్ద విధులు నిర్వహించానని తన 30 ఏళ్ల చరిత్రలో ప్రజలకి పనికొచ్చే ఏ విషయంలో పెండింగ్ పెట్టకుండా విధులు నిర్వహించానని, మనం చేసే విధుల ద్వారానే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని అన్నారు. తన ఉద్యోగ రీత్యా విధులకు సహాయ సహాకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపారు.ఆర్డీఓ లు వేణుమాదవ్, సూర్యనారాయణ, శ్రీనివాసులు, జడ్పీ సి ఈ ఒ వివి అప్పారావు, జిల్లా అధికారులు, తహసీల్దార్ లు, ఎంపిడిఓ లు, మున్సిపల్ కమిషనర్లు, అధికారులు, సిబ్బంది తదితరులు హాజరయ్యారు.
ఈ బ్లాగులో, మేము కేవలం వార్తలను అందించడం కాకుండా, వాటి వెనుక ఉన్న కథలను, దాగి ఉన్న కారణాలను, మరియు భవిష్యత్ పరిణామాలను విశ్లేషిస్తాం. రాజకీయాలు, సాంకేతికత, సామాజిక అంశాలు, చరిత్ర, మరియు ఇంకా ఎన్నో రంగాలలో "గూఢచారి" వలె పరిశోధించి, మీకు ఆసక్తికరమైన మరియు ఆలోచింపజేసే కంటెంట్‌ను అందిస్తాం.
మనభూమి వార్త
హుజూర్ నగర్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
హుజూర్ నగర్, మార్చి 7, 2026: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని బాలాజీ ఫంక్...
ఎక్కువమంది చూసినా వార్త
-
ఐదు నెలలుగా జీతాలు రాక అల్లాడుతున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కుటుంబ పోషణకు అప్పుల పాలవుతున్నాం ఐదు నెలల జీతం చెల్లించేలా కలెక్టర్ ...
-
సూర్యాపేట జిల్లాలో రాబోయే మూడు రోజులు (ఆగస్టు 13 నుండి 15 వరకు) భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, జిల్లా యంత్ర...

