Monday, June 16, 2025

*కాసేపట్లో ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. అసలు విషయం ఇదేనా?*

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ మరోసారి హస్తినకు వెళ్లనున్నారు. సరిగ్గా ఉదయం 10 గంటలకు శంషాబాద్ ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్టు కు చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీ కి చేరుకోనున్నారు.
కేబినెట్ విస్తరణలో భాగంగా ఆదివారం మంత్రులుగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామితో పాటు ధర్మపురి ఎమ్మెల్యేగా అడ్లూరి లక్ష్మణ్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి మంత్రలుగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే వారికి కేటాయించే శాఖలపై చర్చించేందుకు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ పెద్దలను కలిసేందుకు ఢిల్లీకి వెళ్తున్నట్లుగా తెలుస్తోంది.

అదేవిధంగా పార్టీ పదవుల విషయంపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌ తో పాటు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌ తో సీఎం ఇటీవలే సమావేశమయ్యారు. ఆ పదవులపై కూడా ఈ టూర్‌లో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ శ్రేణులు తెలిపాయి. మరోవైపు కొత్త మంత్రుల శాఖల కేటాయింపులపై పార్టీలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి వద్ద మునిసిపల్, పట్టాణాభివృద్ధి శాఖలతో పాటు హోం, విద్య, మైనారిటీ శాఖలు ఉన్నాయి. దీంతో వారికి అవే శాఖలు కేటాయిస్తారా..? లేక ఇప్పుడున్న మంత్రుల శాఖలకు కోత పెడతారా.. అన్న సందేహాలు అందరిలోనూ నెలకొన్నాయ.

*రాజ్ భవన్ లో నూతన మంత్రుల ప్రమాణ స్వీకారం*

తెలంగాణ కేబినెట్‌లో ముగ్గురు మంత్రులు చేరారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ఆదివారం రాజ్‌భవన్‌లో మధ్యాహ్నం 12.19 గంటలకు ప్రమాణస్వీకారం చేశారు. వారితో గవర్నర్ జస్ట్ దేవ్ వర్మ, ప్రమాణం  చేయించారు..

సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యం ఇస్తూ, సీఎం రేవంత్‌ తన టీమ్‌ను విస్తరిస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల్లో లక్ష్మణ్‌, వివేక్‌, శ్రీహరి ఉన్నారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌ అభినందనలు తెలిపారు.

ఇదిలా ఉండగా, తెలంగాణ కేబినెట్‌ విస్తరణలో సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత కల్పించారు సీఎం రేవంత్‌రెడ్డి. ఎస్సీ మాల, ఎస్సీ మాదిగ, బీసీ ముదిరాజ్‌ సామాజిక వర్గాల నుంచి కేబినెట్‌లోకి గడ్డం వివేక్‌, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరికి చోటు కల్పించారు. 

వివేక్‌, లక్ష్మణ్‌ చేరికతో కేబినెట్‌లో దళిత మంత్రుల సంఖ్య నా లుగుకి చేరుతుంది. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఏడుగురు బీసీల్లో ముగ్గురికి మంత్రి పదవులు దక్కినట్లయింది.

ఇక శాసన సభలో ఉప సభాపతి బాధ్యతలు రామచంద్రు నాయక్ స్వీక రించారు. పొన్నం ప్రభాకర్‌, కొండా సురేఖ తోపాటు కేబినెట్‌లోకి వాకిటి శ్రీహరి కూడా చేరారు. ఎస్టీ లంబాడాలకు డిప్యూటీ స్పీకర్‌ పదవి లభించింది,  

డోర్నకల్‌ నుంచి తొలిసారి గెలిచిన రామచంద్రునా యక్‌కి డిప్యూటీ స్పీకర్‌ బాధ్యతలు చేపట్టనున్నా రు. ఎస్టీ ఆదివాసీ నుంచి ఇప్పటికే మంత్రిగా సీతక్క కేబినెట్‌లో ఉన్నారు. అయితే ఈసారి విస్తరణలో రెడ్లకు చోటు దక్కలేదు.

ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ


యాదగిరిగుట్ట : జూన్ 14 : ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి ముగ్గు పోయడం జరిగింది.ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు అధికారులలు ప్రజాప్రతినిధుల సమక్షంలో ఇందిరమ్మ ఇల్లు భూమి పూజ చేసి ముగ్గు పోయడం జరిగింది.ఈ సందర్భంగా తమ సొంత ఇంటి కలను నెరవేర్చినందుకు లబ్దిదారులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్యకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రెటరీ భాస్కర్ రెడ్డి ,మరియు అధికారులు , ఆలేరు మండల మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్ ,గ్రామ శాఖ అధ్యక్షులు గొట్టం విజేందర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ సొంటేం మహేష్, ఆలేరు మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బండపల్లి మహేష్ , మైనార్టీ సెల్ అధ్యక్షులు ఏం.డి ఇమ్రాన్ ఖాన్, కాంగ్రెస్ నాయకులు గాదె సోమిరెడ్డి,కర్రే సునీల్, ఇందిరమ్మ ఇల్లు కమిటీ సభ్యులు చాడ రాజు, కాయితి సంతోష్,గంధమల్ల కర్ణకర్ ,బైరిపాక ఎల్లమ్మ ,మామిడల మంజుల తదితరులు పాల్గొన్నారు...

మనభూమి వార్త

హుజూర్ నగర్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

​హుజూర్ నగర్, మార్చి 7, 2026: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని బాలాజీ ఫంక్...

ఎక్కువమంది చూసినా వార్త