ఆమె కోర్టును ఆశ్రయించగా, ఆ కేసు కొన్ని రోజులు యథాతథంగా నడిచింది. కోర్టులో పీపీ (పబ్లిక్ ప్రాసిక్యూటర్) గానీ, దానికి సంబంధించిన అధికారులు గానీ పట్టించుకోకపోవడంతో, నిందితుడు అక్కడా అందరినీ తన వైపునకు తిప్పుకొని ఆ కేసును కొట్టేయించుకున్నాడు.
దీంతో, బాధితురాలు మళ్ళీ భరణం కేసు (మనవత్రి కేసు) దాఖలు చేసింది. ఈ కేసులో కోర్టు ఆమెకు ₹8,70,000 చెల్లించాలని ఆదేశించింది. ఈ డబ్బు చెల్లించమని అడిగితే, అతను కట్టకుండా తప్పించుకుంటున్నాడు. చట్టం నుండీ, సంబంధిత వ్యక్తుల నుండీ, చివరికి లాయర్ కూడా సరిగా పట్టించుకోకపోవడంతో ఆ కేసు అలాగే ఆగిపోయింది. డబ్బులు మంజూరైనప్పటికీ, వాటి రికవరీ కోసం పిటిషన్ వేయకుండా ఆ కేసును నీరుగార్చారు.
ఈ విషయాలన్నీ అంజమ్మ, సామాన్య బాధితుల సేవా సంఘాన్ని ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దానిపై సామాన్య బాధితుల సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూరాపాటి నాగేశ్వరరావు గారు వెంటనే స్పందించి ఆ అమ్మాయికి న్యాయం చేయడం కోసం మణుగూరు కోర్టుకు, పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కేసులకు సంబంధించిన సమాచారం అంతా తెలుసుకున్నారు.
ఆ తర్వాత వారు సమన్లు పంపగా, ఆ సమన్లు అక్కడికి చేరలేదు. సమన్లు పంపినట్లుగా వారి దగ్గర కానీ, కోర్టు సిబ్బంది దగ్గర కానీ కనీసం రశీదులు కూడా లేవు. దీనిపై తాము తెలుగులో టైప్ చేసి న్యాయమూర్తికి ఒక లేఖను కూడా అందించారు. ఆ తర్వాత నెల కిందట ఒక వారెంట్ కూడా జారీ చేయబడింది. అది కూడా "అదుగో, ఇదిగో" అనుకుంటూ ఇప్పటివరకు బాధితురాలి చేతికి అందలేదు. సామాన్య బాధితుల సేవా సంఘంగా తాము ప్రతి విషయాన్ని తెలుసుకొని ప్రయత్నాలు చేయడంతో, ఆ వారెంట్ జూన్ 20వ తేదీన పోలీసులకు అందింది.
మరో విషాద సంఘటన - మణుగూరు అంజమ్మ కుమారుడి ఆత్మహత్య
ఈ మిరియాల అంజమ్మ రెండవ కుమారుడికి వాజేడుకు చెందిన వారితో అమ్మాయిని ఇచ్చి వివాహం చేయడం జరిగింది. అక్కడ కుల పెద్దలు గొడవలు పెట్టుకొని అందరూ కలిసి ఈ అబ్బాయిని నిర్బంధించడంతో అతను మానసిక ఒత్తిడికి లోనై, మందు తాగి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.
ఆ కేసు ఏమైందో తెలుసుకోవడం కోసం సామాన్య బాధితుల సేవా సంఘం ములుగు కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. సామాన్య బాధితుల సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూరాపాటి నాగేశ్వరరావు గారు తమ ఊరి నుంచి ములుగుకు 522 కి.మీ. రానుపోను ప్రయాణించారు. అక్కడికి వెళ్లి ఆ కేసు వివరాలు తెలుసుకోగా, ఆ కేసులో ఇప్పటికీ ఛార్జిషీట్ నమోదు కాలేదని, ఆ ఛార్జిషీట్ అంతా కూడా తప్పుల తప్పులుగా ఉందని, మళ్ళీ రమ్మని వారికి సమాచారం ఇచ్చారు. దానిపై మళ్ళీ ములుగు వచ్చి, ములుగు సీఐ గారిని కూడా కలిశారు.
సామాన్య బాధితుల సేవా సంఘం - సేవలు
సామాన్య బాధితుల సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూరాపాటి నాగేశ్వరరావు గారు సామాన్యుల కోసం, అమాయకుల కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. ఈ సంఘం 24 గంటలూ బాధితులకు అండగా నిలుస్తుంది. ఎంత దూరమైనా ప్రయాణించి, బాధితుల కష్టసుఖాలు తెలుసుకొని, వారికి న్యాయం జరిగేంత వరకు వారి తరపున నిలబడి సేవ అందిస్తుంది.
వారు చేస్తున్నటువంటి ఈ సేవా కార్యక్రమాలు, సమాజానికి, పేదవారికి అందిస్తున్న సేవలు వారి గొప్పతనాన్ని చాటి చెబుతున్నాయి. దీనిని అర్థం చేసుకొని అందరూ వారి సంఘం ఆశయాల కోసం పని చేయాలి. ప్రజలందరూ సామాన్య బాధితుల సేవా సంఘం ఒకటి ఉందని తెలుసుకొని, బాధితులకు ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా సామాన్య బాధితుల సేవా సంఘానికి ఫిర్యాదు చేయవచ్చని రాష్ట్ర అధ్యక్షుడు కూరాపాటి నాగేశ్వరరావు తెలియజేశారు.