Friday, August 15, 2025

నూతన హుజూర్ నగర్ ఎస్ఐ బండి మోహన్ బాబుకు టీజేఏ ప్రెస్ క్లబ్ సభ్యుల సన్మానం

హుజూర్ నగర్ ఎస్ ఐ గా బాధ్యతలు చేపట్టిన మోహన్ బాబును ఘనంగా సన్మానించిన టీజేఏ...
 ఆగస్టు 15
హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని తెలంగాణ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (టీజేఏ) సూర్యాపేట జిల్లా జిల్లా అధ్యక్షులు షేక్ సైదా ఆధ్వర్యంలో  హుజూర్ నగర్ ఎస్ ఐ గా నూతన బాధ్యతలు చేపట్టిన బి మోహన్ బాబును మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో  సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా టీజేఏ కోశాధికారి కొత్తపల్లి మధుసూదన్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ భీమపంగు వెంకటేశ్వర్లు,కోల్లోజు నాగేంద్ర చారి మేళ్లచెరువు మండల టీజేఏ అధ్యక్షుడు కొమ్ము మహేష్, బయ్యారపు రవీంద్ర, పెందుర్తి సతీష్, గోరంట్ల శ్రీనివాస్ మహమ్మద్ యాసిన్ పాల్గొన్నారు..

టీజేఏ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

టీజేఏ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
హుజూర్‌నగర్, ఆగస్టు 15:
తెలంగాణ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (టీజేఏ) సూర్యాపేట జిల్లా కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీజేఏ జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా జాతీయ జెండాను ఎగురవేశారు.
ఈ సందర్భంగా షేక్ సైదా మాట్లాడుతూ, స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేశారని, వారి పోరాట స్ఫూర్తితో దేశాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని ఆయన పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, జర్నలిస్టుల సంక్షేమం కోసం టీజేఏ వ్యవస్థాపకుల ఆదేశాల మేరకు సూర్యాపేట జిల్లాలో త్వరలో హౌసింగ్ సొసైటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
టీజేఏ వ్యవస్థాపకులు ఎన్ యు జె (ఐ)జాతీయ మాజీ అధ్యక్షుడు ఉప్పల లక్ష్మణ్ టీజేఏ అధ్యక్షుడు వెంకటరమణారావు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉక్కల్ కర్ రాజేందర్ నాథ్, స్టేట్ జనరల్ సెక్రెటరీ ఎంఆర్ ఘో రీ ల ఆదేశాల మేరకు సూర్యాపేట జిల్లాలో టీజేఏ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం త్వరలో హౌసింగ్ సొసైటీ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో టీజేఏ జిల్లా కోశాధికారి కొత్తపల్లి మధుసూదన్, జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యులు భీమపంగు వెంకటేశ్వర్లు, కొల్లోజు నాగేంద్ర చారి, మేళ్లచెరువు మండల అధ్యక్షుడు కొమ్ము మహేష్, బయ్యారపు రవీంద్ర, పెందుర్తి సతీష్, గోరంట్ల శ్రీనివాస్, మహమ్మద్ యాసిన్, సూర్యాపేట పట్టణానికి చెందిన షేక్ అహ్మద్ అలీ మజీద్ తదితరులు పాల్గొన్నారు.

మనభూమి వార్త

హుజూర్ నగర్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

​హుజూర్ నగర్, మార్చి 7, 2026: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని బాలాజీ ఫంక్...

ఎక్కువమంది చూసినా వార్త