ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రఖ్యాత సంస్థ అయిన ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్(AICF) వారు అందించే ప్రతిష్టాత్మకమైన నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డు-2025 కు U K B. Ed కళాశాల గోధుమ కుంట గ్రామం. కీసర మండలం నందు ప్రిన్సిపల్ గా పనిచేస్తున్న బయ్యారపు సురేందర్ వర్మను వరించింది
ఈ అవార్డు అందుకోవటం పట్ల కళాశాల యాజమాన్యం డైరెక్టర్ ఉదయ్ కుమార్ గారు
కరస్పాండెంట్ డాక్టర్ విద్య స్రవంతి గారు అభినందనలు తెలియజేశారు ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలియజేశారు
డాక్టర్ బయ్యారపు సురేందర్ వర్మ గారు 2007 సంవత్సరం నుండి లెక్చరర్ గా పనిచేస్తూ 2015 లో ప్రిన్సిపల్ గా పదోన్నతి పొంది విద్యా విధానంలో తన వంతు పాత్ర పోషిస్తూ వందలాదిమంది ఛాత్రోపాధ్యాయులను ఈ సమాజానికి అందిస్తూ భావి భారత పౌరులను తీర్చిదిద్దుటలో అలుపెరగని కృషి చేసినందుకు గాను నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డ్ కు ఎంపిక కావడం జరిగింది
డాక్టర్ బయ్యారపు సురేంద్ర వర్మ ఉస్మానియా యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ లో డాక్టరేట్ పొంది నేషనల్, ఇంటర్నేషనల్, సెమినార్స్ లో పాల్గొని గణిత బోధన పద్ధతి లు పుస్తకాలను రచించి బోధన వృత్తి ద్వారా సమాజ శ్రేయస్సు పట్ల తన కృషిని గుర్తించి AICF వారు ఈ అవార్డును ప్రధానం చేయడం జరిగింది
ఈ సందర్భంగా విద్యావంతులు మేధావులు రీసెర్చ్ స్కాలర్స్ AICF ఫౌండర్ విజయ రాజు గద్దపాటి గారిని అభినందించడం జరిగింది
ఈ అభినందన సభలో తన మిత్రులు పూర్వ విద్యార్థులు కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది
ఈ కార్యక్రమంలో మాజీ SC కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి. గదరాజు చందు, డాక్టర్ NP. వీరస్వామి, శనిగరపు బాలకృష్ణ, అభిజిత్, సేవాలాల్ సేన రాష్ట్ర కార్యదర్శి లాలూ ప్రసాద్, బోరెల్లి సురేష్ కూరెళ్ళ మహేష్ బాబు, సైదులు మొదలగు వారు పాల్గొన్నారు.