సాయి బాలాజీ రైస్ మిల్ నిర్లక్ష్యం వల్ల ముగ్గురు కార్మికుల మీద వేడి బూడిద పడి తీవ్రంగా గాయాలు, పెద్దఆస్పత్రి తరలింపు
మనభూమి వార్త.. నవంబర్ 27:
బాలాజీ రైస్ మిల్ నిర్లక్ష్యంతో వరి పొట్టు బూడిదను ఎత్తడంలో కార్మికుల కాళ్లు, చేతులు తీవ్రంగా కాలిపోయాయి. ముగ్గురు కార్మికులు కాలిపోయే ప్రమాదం వల్ల చికిత్స పై హైదరాబాద్ కు తరలించినట్లు సమాచారం. మిషన్ వద్ద నీరు చల్లకుండా యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగింది. కార్మికులకు అవసరమైన రక్షణ పరికరాలు (హెల్మెట్, గ్లౌజులు) అందలేదు. ఈ ప్రమాదంతో కుటుంబాలు తీవ్ర ఆవేదనలో ఉన్నాయి. కార్మికులు ప్రమాదానికి గురైనప్పటికీ యాజమాన్యం బాధ్యత తీసుకోవడంలేదు. కార్మిక సంఘాలు రైస్ మిల్ పై కఠిన చర్యలు కోరుతున్నారు. కార్మికుల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలి. తోటి కార్మికులు వాపోతున్నారు.