Wednesday, July 30, 2025

వృత్తిలో గీత కార్మికుని దుర్మరణం - రూ. 5 లక్షల ఎక్స్-గ్రేషియా మంజూరుకు డిమాండ్

వృత్తిలో గీత కార్మికుని దుర్మరణం - రూ. 5 లక్షల ఎక్స్-గ్రేషియా మంజూరుకు డిమాండ్


యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి జిల్లా, జూలై 30, 2025:

యాదాద్రి భువనగిరి జిల్లా, రాజపేట మండలం, దూది వెంకటాపురం గ్రామానికి చెందిన గీత కార్మికుడు గొడిసెల శ్రీరాములు గౌడ్ , ఈరోజు (బుధవారం) ఉదయం వృత్తిలో భాగంగా తాటిచెట్టు ఎక్కి మేరవేస్తుండగా, ప్రమాదవశాత్తు మోకు జారి కిందపడి అక్కడికక్కడే మృతి చెందారు.

ఈ విషాదకర ఘటనపై కల్లుగీత కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. మృతుడు శ్రీరాములు గౌడ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, సంఘం తరపున శ్రద్ధాంజలి ఘటించింది.

కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి బోలగాని జయరాములు ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రభుత్వం వెంటనే స్పందించి మృతుని కుటుంబానికి రూ. 5 లక్షల ఎక్స్-గ్రేషియా (అంత్యక్రియల సహాయం) మంజూరు చేయాలని ఎక్సైజ్ ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు. కార్మికుల భద్రతకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు.

మనభూమి వార్త

హుజూర్ నగర్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

​హుజూర్ నగర్, మార్చి 7, 2026: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని బాలాజీ ఫంక్...

ఎక్కువమంది చూసినా వార్త