Wednesday, October 29, 2025

హుజూర్ నగర్ తహశీల్దార్ (MRO)గా పనిచేసిన శ్రీ నాగార్జున రెడ్డి ఘనంగా వీడ్కోలు

హుజూర్ నగర్ తహశీల్దార్ (MRO)గా పనిచేసిన శ్రీ నాగార్జున రెడ్డి ఘనంగా వీడ్కోలు 

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం ఆర్డీవో శ్రీనివాసులు ఏర్పాటు చేసిన మందాడి నాగార్జున రెడ్డి సన్మాన కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ సూర్యాపేట జిల్లా కమిటీ సభ్యులు పాల్గొని మందాడి నాగార్జున రెడ్డి పూలమాలతో సత్కరించి శాలువాతో సన్మానించారు. హుజూర్ నగర్ తహశీల్దార్ గా  నాగార్జున రెడ్డి పనిచేస్తూనే కష్టతరమైన ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ బాధ్యతలను సమగ్రంగా నిర్వహిస్తూనే గ్రూప్-1 పరీక్షలకు ప్రిపేరై  అసిస్టెంట్ కమీషనర్ (సిటీఓ) గా సాధించి రెవిన్యూ డిపార్ట్మెంట్ ను వదిలి నూతన పదవి చేపడుతున్న సిటిఓ నాగార్జున రెడ్డి కి ప్రతి ఒక్కరూ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ సూర్యాపేట జిల్లా కమిటీ  షేక్ సైదా, కొత్తపల్లి మధుసూదన్, భీమపంగు వెంకన్న, బయ్యారపు రవీంద్ర, కొల్లోజు నాగేంద్ర చారి, పెందుర్తి సతీష్, గోరంట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

మనభూమి వార్త

హుజూర్ నగర్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

​హుజూర్ నగర్, మార్చి 7, 2026: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని బాలాజీ ఫంక్...

ఎక్కువమంది చూసినా వార్త