గురువారం పట్టణంలోని ముత్యాలమ్మ ఊర చెరువు ను ఆక్రమించి ఫినిషింగ్ వేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులతో వాగ్వాదాన్ని దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని 240 సర్వే నెంబర్లో గల ఊర చెరువు స్థలం ను కొంతమంది అధికార పార్టీ నాయకులు మాజీ కౌన్సిలర్ వేముల వరలక్ష్మి, నాగరాజు కుటుంబ సభ్యులు అక్రమంగా ఆక్రమించి చుట్టూ ఫినిషింగ్ చేయడానికి తీవ్రంగా ఖండించారు. రెండు కోట్లు రూపాయల విలువ చేసే చెరువు స్థలంలో ఆక్రమించి అక్రమ నిర్మాణం చేపట్టడం సరైన విధానం కాదన్నారు.
పురాతన కాలం నాటి శివాలయం గ్రామదేవత ముత్యాలమ్మ ఆలయాల మధ్య ఉన్న బతుకమ్మ ఘాటు చెరువు శిఖం భూమిని కబ్జా చేసి ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్న అధికార పార్టీ నాయకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
పట్టణంలోని నగరం నడిబొడ్డున కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ చెరువు శిఖరం భూమి ఆక్రమిస్తున్న మున్సిపల్ రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అధికార పార్టీ పెద్దల సహకారంతోనే రెండు కోట్లు విలువ చేసే భూమిని అక్రమిస్తున్నారని ఆరోపించారు.
హిందువుల దేవాలయాల ప్రాంగణం ల మధ్య స్థలం ఆక్రమణకు గురి కావడం పట్ల హిందూ భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మనోభావాలను దెబ్బతీసే విధంగా అధికార పార్టీ నాయకులు వివరిస్తున్న తీరును తీవ్రంగా ఖండించారు.
నీటిపారుదల శాఖ అధికారులు వెంటనే అక్రమంగా వేసిన పింఛన్లను తొలగించాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో జగన్, శంకర్, తారకు, నరసింహారావు, పాల్గొన్నారు.
No comments:
Post a Comment