Monday, June 23, 2025

పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు పంపిణీ

భారతీయ జనతా పార్టీ సూర్యాపేట జిల్లా కార్యాలయంలో డా. శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన బిజెపి జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలతరెడ్డి గారు...

అనంతరం జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు బూర శకుంతల గారి ఆధ్వర్యంలో, స్థానిక శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో  నిర్వహించినటువంటి మొక్కల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలతరెడ్డి గారు హాజరై డా. శ్యామాజీ గారి త్యాగాలను స్మరించుకుంటూ, పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు పంపిణీ చేశారు...

చల్ల శ్రీలతరెడ్డి “డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు భారత రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే వ్యక్తిత్వం. వారు స్వాతంత్ర్యానంతర భారత రాజకీయం లో విలక్షణ మార్గాన్ని ఎంచుకుని దేశ సమగ్రత, ఏకత్వం కోసం నిరంతరంగా కృషి చేశారనీ, ప్రఖ్యాత విద్యావేత్తగా, 33ఏళ్ల వయసులోనే కలకత్తా విశ్వవిద్యాలయానికి వైస్ చాన్సలర్‌గా నియమితులై, విద్యా రంగంలో నూతనోత్సాహాన్ని తీసుకొచ్చారని కొనియాడారు...

వారు కేంద్ర మంత్రిగా పనిచేసినపుడు పారిశ్రామికాభివృద్ధికి మార్గసూచినిచ్చారు. అయితే జమ్మూ కాశ్మీర్ విషయంలో నెహ్రూ ప్రభుత్వ విధానాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా (ఆర్టికల్ 370) కల్పించడమూ, ఆ రాష్ట్ర ప్రస్తుత పరిస్థితులను దేశంలో విలీనపరచకుండా ఉంచడమూ ఆయనకు అందలేని విషయాలు అయ్యాయని, ఆయన అభిప్రాయం ప్రకారం – “దేశం ఒక్కటే అయితే, రాజ్యాంగం ఒక్కటే ఉండాలని, రెండు జెండాలు, రెండు ప్రధానులు అనే వ్యవస్థ దేశాన్ని చీల్చే ప్రయత్నమే అవుతుంది.” అని హితవు పలికారు...

ఈ నినాదంతో 1953లో ఆయన్ను కాశ్మీర్‌లో ప్రవేశించిన వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన ఆరోగ్య పరిస్థితిని పట్టించుకోకుండా జైలులో నిర్లక్ష్యంగా ఉంచారని జూన్ 23న ఆయన మరణించడంతో, అది అనుమానాస్పద మృతిగా చరిత్రలో నమోదైందన్నారు. నెహ్రూ ప్రభుత్వం ఆయన మరణంపై పూర్తిస్థాయిలో విచారణ చేయకపోవడమూ, ఈ సంఘటనకు ఇప్పటికీ న్యాయం జరగకపోవడమూ ఆవేదన కలిగించే అంశాలుగా ఉన్నాయన్నారు...

వారి త్యాగం భారతదేశ సమగ్రతకు బలమైన నాంది. ఆయన బలిదానమే భవిష్యత్‌లో ఆర్టికల్ 370 రద్దు వంటి చారిత్రక నిర్ణయాలకు బీజమైంది. దేశం పట్ల ఆయనకున్న రాజీపడనటువంటితత్త్వo నేటి యువతకు మార్గదర్శకంగా నిలవాలన్నారు...

ఇలాంటి మహానుభావుని బలిదానాన్ని స్మరించుకుంటూ, ఈ బలిదాన్ దివస్‌ను నిర్వహించడం, పర్యావరణ పరిరక్షణకు సూచకంగా మొక్కలు పంపిణీ చేయడం ఎంతో ప్రాముఖ్యత కలిగినదిగా భావిస్తున్నామన్నారు... పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై డా. శ్యామాజీ గారి త్యాగాలను పునఃస్మరించుకోవాలని అన్నారు...

ఇట్టి కార్యక్రమంలో ప్రోగ్రాం కన్వీనర్ బూర మల్సూర్ గౌడ్, జల్లా జనార్ధన్, బిజెపి సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కడియం రాంచంద్రయ్య, జుట్టుకొండ సత్యనారాయణ, చల్లమల నరసింహ, రుక్మారావు, మన్మధరెడ్డి, గజ్జల వెంకటరెడ్డి, మహేష్, లింగారెడ్డి, కాషయ్య, ఫణినాయుడు, రవి, తాళ్ల నరేందర్ రెడ్డి, శోభారెడ్డి, మౌనిక,  దాసరివెంకన్న, బైరు విజయ్ కృష్ణ, వర్మ, గణేష్, తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు...

No comments:

మనభూమి వార్త

హుజూర్ నగర్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

​హుజూర్ నగర్, మార్చి 7, 2026: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని బాలాజీ ఫంక్...

ఎక్కువమంది చూసినా వార్త