.. మోడీ సర్కార్ పై విశ్వాసంతో పిఎసిఎస్ వైస్ చైర్మన్ ఆయన అనుచరులు భాజపాలు చేరిక..
మంజులాపూర్ పిఎసిఎస్ వైస్ చైర్మన్ కడ్తాల్ గ్రామానికి చెందిన బర్మా గంగా దాస్ ఆయన అనుచరులు ఆదివారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే, భాజపా శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు ఆకర్షితులవుతున్నారని ఈ మేరకు పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. భాజపా దేశ సమగ్రతకు, సమైక్యతకు అభివృద్ధి సంక్షేమ రంగాల్లో చేపడుతున్న అనేక కార్యక్రమాల పట్ల ప్రజలకు అత్యంత నమ్మకం కుదిరిందని అందులో భాగంగానే గంగా దాస్ , ఆయన అనుచరులు పార్టీలో చేరారని వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించామని అన్నారు. రానున్న ఎన్నికల్లో అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ డబుల్ ఇంజన్ సర్కార్ జయకేతనం ఎగరేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి నెరవేర్చడం లేదని అన్నారు. గత పంట కాలంలో 40 లక్షల మంది రైతుల ఖాతాలో రైతు భరోసా కింద జమ చేయాల్సిన పెట్టుబడి సాయం 25 లక్షల మందికే పరిమితం చేసిందని, మరో 15 లక్షల మందికి ఎగ్గొట్టిందని కాంగ్రెస్ పార్టీ విధానాలను ఘాటు గా విమర్శించారు. దరఖాస్తులకు అనుగుణంగా రేషన్ కార్డులు, పింఛన్లు అందజేయడం లేదని దీంతో కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు విశ్వాసం పోయిందని అన్నారు. ప్రభుత్వ ఖజానాలో నిధులు లేవని, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం లేదని ఆయన విమర్శించారు
. కార్యక్రమంలో నిర్మల్ ఉమ్మడి మండల పరిషత్ మాజీ అధ్యక్షులు భాజపా నాయకులు వి. సత్యనారాయణ గౌడ్, రాష్ట్ర నాయకులు రావుల రామ్నాథ్, ముత్యం రెడ్డి, జమాల్ తదితరులు పాల్గొన్నారు.
#alletimaheshwarreddy #nirmalmla #bjlpleader #BJPTelangana
No comments:
Post a Comment