Thursday, July 10, 2025

హుజూర్ నగర్ నివాసి కొమ్ము బాలరాజు అకాల మరణం మాల సామాజిక వర్గానికి తీరని లోటు.

మాల మహానాడు, హుజూర్ నగర్ నియోజకవర్గ అధ్యక్షులు దగ్గుపాటి బాబురావు మాల మహానాడు ముఖ్య నాయకులతో కలిసి దివంగత కొమ్ము బాలరాజు పార్థివదేహానికి ఘన నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, తాము అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.
"కొమ్ము బాలరాజు అకాల మరణం మాల సమాజానికి పూడ్చలేని నష్టాన్ని కలిగించింది" అని దగ్గుపాటి బాబురావు అన్నారు.
ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా నాయకులు కోల్లపూడి దయాకర్, మాల కుల పెద్దలు మామిడి ఇమ్మానియేల్, కుడితెటి ఇర్మియ, కోల్లపూడి ఏసురత్నం, కోల్లపూడి కళ్యాణ్ రావు, అంబేద్కర్ కమిటీ అధ్యక్షుడు కోల్లపూడి యోహాన్, మామిడి వసంత్ కుమార్, మండల అధ్యక్షుడు కమల రాజా, కోల్లపూడి జాన్ వెస్లీ, కోల్లపూడి ప్రవీణ్, కోల్లపూడి ఇస్సాక్, దగ్గుపాటి పేతురు, కోల్లపూడి రాజశేఖర్ తదితరులు, మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

No comments:

మనభూమి వార్త

హుజూర్ నగర్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

​హుజూర్ నగర్, మార్చి 7, 2026: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని బాలాజీ ఫంక్...

ఎక్కువమంది చూసినా వార్త