ఈరోజు *భారతీయ జనతా పార్టీ హుజూర్ నగర్ పట్టణ అధ్యక్షులు కొండ హరీష్ గౌడ్* ఆధ్వర్యంలో *విశ్రాంత ఉపాధ్యాయుల సంఘం ప్రధాన కార్యదర్శి కొప్పుల వీరారెడ్డి* సమక్షంలో గురు పౌర్ణమి సందర్భంగా పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల కార్యాలయంలో విశ్రాంత ఉపాధ్యాయులు మరియు ఎంతోమందికి విద్యను నేర్పి వారి ఎదుగుదలకు కారణమయినటువంటి *పులిపాటి నరసయ్య, ఎం.బి. దేవదానం, ఎం.డి మొయినుద్దీన్, పి. మోహన్, కె.వి.ఎన్. మూర్తి మరియు బి. రామలక్ష్మమ్మ* గార్లను సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ గురువు యొక్క గొప్పతనాన్ని వారి ఔనత్యాన్ని మరియు ఈ సమాజానికి గురువు యొక్క అవసరం ఎంత ఉన్నదో తెలియజేయడం జరిగింది.
అలాగే *బిజెపి పట్టణ అధ్యక్షులు కొండ హరీష్ గౌడ్* మాట్లాడుతూ భూమ్మీద ఉన్న ప్రతి ఒక్క గురువుకి పాదాభివందనాలు తెలుపుతూ ఈ దేశ భవిష్యత్తును నిర్మించేది గురువులే అని, ఈ భూమి మీద అత్యంత గొప్ప వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని కొనియాడారు. గురువును త్రిమూర్తులతో పోల్చినటువంటి గొప్ప సంస్కృతి మనదని, అలాగే ఈ గురుపరంపర ఈనాటిది కాదని వేదకాలం నాటి నుండి ఉందని, ఆ రోజుల్లో గురుకులాల వ్యవస్థ ఉండేదని, గురుకులంలో విద్యార్థులు గురువులకు సేవ చేస్తూ చతుః షష్టి కలలను నేర్చుకునే వారని తెలిపారు. నాటి త్రేతా యుగం నుంచి నేటి కలియుగం వరకు శ్రీరాముడు వశిష్ట మహర్షి దగ్గర శ్రీకృష్ణుడు సాందీపని ముని దగ్గర అలాగే చత్రపతి శివాజీ మహారాజ్ సమర్థ గురు రామదాసు దగ్గర వారు వాళ్లను గురువుగా స్వీకరించి ఉపదేశం పొందిన వారే అని తెలిపారు. ఈ సమాజానికి గొప్ప మార్గ నిర్దేశకులు గురువులని ఈ లోకంలో పెద్ద పెద్ద రాజులు, యుగ పురుషులు, మహానుభావులు అంతెందుకు దేవుళ్ళు సైతం ఏదో ఒక గురువు దగ్గర ఉపదేశం పొందిన వారే అని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు ఎం.ఎస్.ఎన్. రాజు, పి. చంద్రశేఖర్, అలవాల చంద్రయ్య, కె. లక్ష్మయ్య, టి. ప్రభాకర్ రెడ్డి, పి.ఎల్.ఎన్. రెడ్డి గార్లతోపాటు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు చింతలపూడి ఉమామహేశ్వర్, జిల్లా నాయకులు దేనుమకొండ రామరాజు, పట్టణ ప్రధాన కార్యదర్శి గుండా గోపి, ఉపాధ్యక్షుడు కొల్లోజు నాగేంద్ర చారి, కంటు నాగరాజు, చుక్క హరీష్, పులి నరసింహారావు, బలవంత్ సింగ్ మరియు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment