Saturday, August 16, 2025

మాజీ ఎమ్మెల్యే వద్ద పనిచేసిన వర్కర్స్ తో CM రిలీఫ్ ఫండ్ చెక్కులను స్వాహా

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను స్వాహా చేసిన నిందితులు అరెస్ట్ 
 ఆగస్టు16 
సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఎస్పీ నరసింహ మాట్లాడుతూ కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందకుండా స్వాహా చేసిన కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేసి నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు.కోదాడ నియోజకవర్గ మాజీ ఎంఎల్ఏ బొల్లం మల్లయ్య యాదవ్ క్యాంప్ ఆఫీసు నందు సోషల్ మీడియా కో ఆర్డినేటర్ గా పని చేసే చెడపంగు నరేష్, మరియు ప్రైవేట్ పి ఏ లు గా పని చేసిన మర్ల వీరబాబు,ఉప్పల మధులు వద్దనే ముఖ్య మంత్రి సహాయ నిధి సంబందించిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కలిగి మర్ల వీరబాబు, ఉప్పల మధు లు పర్యవేక్షించేవారు. 2023 సం.నవంబర్ నెలలో జనరల్ ఎలెక్షన్ కోడ్ వస్తున్నది చూసి ఎంఎల్ఏ  క్యాంప్ ఆఫీసు నందు పని చేసిన నరేశ్, వీరబాబు, మధు, మరియు వారి వెంట తిరిగే సూరగని రాంబాబు దురుద్దేశంతో కొన్ని వివిధ పేర్లతో ఉన్న 44 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ లను ప్రక్కన పెట్టి అట్టి చెక్కులను  వారు రీవాలిడేషన్ చేయించుకొని అదే పేర్లతో ఉన్నవేరే వ్యక్తులను చూసుకొని వారి అకౌంట్ లో డబ్బులు జమ చేయించి తీసుకోవాలని  పథకం ప్రకారం అట్టి పథకం లో బాగంగా 44 చెక్కులను వారికి తెలిసిన శాసనమండలి లో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్న గుంటుక సందీప్ అనే వ్యక్తి ద్వారా రివాలిడేషన్ చేయించి అదే పేర్లతో ఉన్నవారిని చూసుకొని వారి యొక్క అక్కౌంట్స్లో చెక్కులు జమ చేయించి అట్టి డబ్బులను లబ్ది దారులకు చెందకుండా నకిలీ అక్కౌంట్స్ ద్వారా డబ్బులు డ్రా చేయగా  వచ్చిన డబ్బులు అందరు కలిసి పంచుకున్నారు. చెడపంగు నరేష్ తన స్నేహితుడు అయిన రంగిశెట్టి వెంకట రావు అక్కౌంట్ ద్వారా డబ్బులు డ్రా చేసే వాడు, గుంటుక సందీప్ నుండి డ్రా చెయ్యని 6 చెక్కులు, వారు నేరానికి వాడిన సెల్ ఫోన్లు 5, నకిలీ అక్కౌంట్స్ ద్వారా ఖర్చులు పోగా మిగిలిన రూ. 9,30,000/- నగదు స్వాదీనo చేసుకోవడం జరిగినది, మోసం చేసి బ్యాంక్ ల నుండి డ్రా చేసిన డబ్బులు రూ. 13,63,000/-రూపాయల విలువ ఉండును, అరెస్ట్ చేసిన ముద్దయిలను రిమాండ్ కు తరలించడం జరిగిందని ఎస్పీ నర్సింహ తెలిపారు మాజీ ఎమ్మెల్యే  అధ్వర్యంలో లబ్దిదారులు ధరకాస్తు చేసుకున్నారు, క్యాంప్ కార్యాలయం నందు పని చేసే ప్రవేట్ వ్యక్తులు వారి స్వలాభం కోసం వ్యక్తుల పేర్లు మార్చి మాజీ ఎమ్మెల్యేకి తెలియకుండా అక్రమంగా వేరే వ్యక్తుల పేర్లు మీద చెక్కులు డ్రా చేసి ఈ నేరానికి పాల్పడ్డారని ఇట్టి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల కేసును త్వరితగతంగా ఛేదించడం లో పర్యవేక్షణ చేసిన డి.ఎస్.పి   శ్రీధర్ రెడ్డి, చాకచక్యత ప్రదర్శించన  కోదాడ టౌన్ ఇన్స్పెక్టర్ కే. శివ శంకర్, ఎస్ ఐ హనుమ నాయక్, సిసిఎస్ ఇన్ప్సెక్టర్ శివ కుమార్, సి‌సి‌ఎస్ హరికృష్ణ, హెడ్ కానిస్టేబుల్ కర్ణాకర్, శ్రీనివాస్,సైదులు,ఆనంద్,మల్లేష్,సతీష్, శివ కృష్ణ,ప్రభాకర్,హెడ్ కానిస్టేబుల్ బాల్తు శ్రీనివాస్,కానిస్టేబుల్స్ యల్లా రెడ్డి, సతీశ్ నాయుడు, రాంబాబు లను సూర్యాపేట జిల్లా ఎస్పీ కే. నరసింహ  అభినందించడం జరిగినది, ఇట్టి కేసులను ఛేదించిన సిబ్బందికి ఎస్పీ రివార్డ్స్ అందించారు

నేరస్తుల వివరాలు


1)చెడపంగు నరేష్: (30) మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ క్యాంప్ ఆఫీసులో సోషల్ మీడియాకో-ఆర్డినేటర్‌
 
2)మర్ల వీరబాబు: (34) మాజీ ఎమ్మెల్యేకు ప్రైవేట్ పీఏ .

3)ఉప్పుల మధు (35) మాజీ ఎమ్మెల్యేకు ప్రైవేట్ పీఏ

4)సురగాని రాంబాబు(34) వ్యవసాయదారుడు.

5)గుంటుక సందీప్ (34) శాసన మండలిలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తూ, చెక్కులను రీ-వాలిడేషన్ చేయడంలో సహాయం చేశారు.

6)రంగిశెట్టి వెంకట రావు: (30) ప్రైవేట్ ఉద్యోగి. నరేష్‌కు డబ్బు డ్రా చేయడంలో సహకరించారు.

స్వాదిన వివరాలు

ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 9.30 లక్షల నగదు మరియు 8 చెక్కులు స్వాధీనం 

మొత్తం నష్టం నిందితులు మొత్తం 44 చెక్కులను దుర్వినియోగం చేయగా వాటి మొత్తం విలువ రూ. 15,83,500. ఇందులో 36 చెక్కులు (విలువ రూ. 13,63,000) డ్రా చేయబడ్డాయన్నారు.

1 comment:

Anonymous said...

Nice

మనభూమి వార్త

హుజూర్ నగర్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

​హుజూర్ నగర్, మార్చి 7, 2026: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని బాలాజీ ఫంక్...

ఎక్కువమంది చూసినా వార్త