ప్రజాకవి, పద్మ విభూషణ్ శ్రీ కాళోజీ నారాయణ రావు పేరిట తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ద్వారా ప్రతి ఏటా అందజేసే ప్రతిష్టాత్మకమైన సాహితీ పురస్కారం 2025 సంవత్సరానికి ప్రముఖ కవయిత్రి, రచయిత్రి శ్రీమతి నెల్లుట్ల రమాదేవిని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ఆమెకు అభినందనలు తెలియజేశారు.
ప్రజా కవి, తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల కమిటీ శ్రీమతి నెల్లుట్ల రమాదేవిని ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. కమిటీ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి ఆమోదించారు.
ఈ పురస్కారాన్ని సెప్టెంబర్ 9, 2025న రవీంద్రభారతిలో జరిగే కాళోజీ జయంతి వేడుకలలో అందజేయనున్నారు.
No comments:
Post a Comment