వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం
హైదరాబాద్: హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా, సున్నితంగా ముగియడంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తొమ్మిది రోజులపాటు భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో గణనాథుడిని పూజించి, ఘనంగా వీడ్కోలు పలికారని ఆయన పేర్కొన్నారు.
శోభాయాత్ర ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా, ప్రశాంతంగా సాగేందుకు పగలు, రాత్రి శ్రమించిన పోలీసు, మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్, రవాణా, పంచాయతీ రాజ్, ఇతర శాఖల అధికారులు, సిబ్బందికి ముఖ్యమంత్రి మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. ఉత్సవ కమిటీ సభ్యులు, మండపాల నిర్వాహకులు, క్రేన్ ఆపరేటర్ల కృషిని కూడా ఆయన ప్రశంసించారు.
ట్యాంక్‌బండ్‌తో పాటు ఇతర ప్రాంతాలలో లక్షలాది విగ్రహాల నిమజ్జనం సజావుగా, సకాలంలో జరగడానికి సహకరించిన హైదరాబాద్ ప్రజలందరికీ ముఖ్యమంత్రి తమ అభినందనలు తెలియజేశారు.
No comments:
Post a Comment