Tuesday, September 30, 2025

సామాన్య బాధితుల సేవ సంఘం కార్యాలయ స్థలం కేటాయింపు ప్రక్రియ వేగవంతం


ఖమ్మం:
ఈరోజు (సెప్టెంబర్ 30, 2025) సామాన్య బాధితుల సేవ సంఘం అధ్యక్షులు కూరపాటి నాగేశ్వరరావు మరియు కార్యవర్గ సభ్యులు అందరూ కలిసి ఖమ్మం అర్బన్ తహసిల్దార్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
సంఘం యొక్క కార్యాలయం నిర్మాణం కోసం స్థలం కేటాయింపు కోరుతూ గతంలో జిల్లా కలెక్టర్ గారికి సమర్పించిన దరఖాస్తును పరిశీలించారు. కలెక్టర్ గారి కార్యాలయం నుండి ఈ దరఖాస్తును తదుపరి చర్యల నిమిత్తం ఖమ్మం అర్బన్ తహసిల్దార్ కార్యాలయానికి బదిలీ చేయడం జరిగింది.
ఈ నేపథ్యంలో, బదిలీ అయిన దరఖాస్తుకు సంబంధించిన పత్రాలను సభ్యులందరూ కలిసి తహసిల్దార్ గారి దృష్టికి తీసుకువచ్చి, స్థలం కేటాయింపు ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయవలసిందిగా ప్రస్తావించడం జరిగింది. సామాన్య బాధితుల సంక్షేమం కోసం కార్యాలయం ఏర్పాటు అత్యవసరం అని సంఘం అధ్యక్షులు ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.
తహసిల్దార్ గారు ఈ అంశంపై సానుకూలంగా స్పందించి, నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఇట్టి కార్యక్రమానికి తెలంగాణ సామాన్య బాధితుల అధ్యక్షులు కూరపాటి నాగేశ్వరరావు, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొల్లోజు నాగేంద్ర చారి, ఖమ్మం జిల్లా అధ్యక్షులు శీలం రామకృష్ణారెడ్డి, సంగం లీగల్ అడ్వైజర్ ధరావత్ ప్రసాద్, దోసపాటి వెంకటేశ్వరరావు గౌరవ సభ్యులు వేండ్ర రామకృష్ణ ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు.

No comments:

మనభూమి వార్త

హుజూర్ నగర్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

​హుజూర్ నగర్, మార్చి 7, 2026: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని బాలాజీ ఫంక్...

ఎక్కువమంది చూసినా వార్త