ఏక్ తా దివస్ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్కి ఘన నివాళులు: కొండ హరీష్ గౌడ్
ఈరోజు భారతీయ జనతా పార్టీ హుజూర్ నగర్ పట్టణ అధ్యక్షులు కొండ హరీష్ గౌడ్ అధ్యక్షతన రాష్ట్ర నాయకులు శ్రీ చింతలపూడి ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో భారతదేశ ఉక్కుమనిషి, తొలి ఉప ప్రధాని మరియు హోంశాఖ మంత్రి, భారతరత్న శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా పట్టణ బిజెపి కార్యాలయంలో చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు కొండ హరీష్ గౌడ్ మాట్లాడుతూ సర్దార్ వల్లభభాయ్ పటేల్ స్వాతంత్ర్యానికి ముందు, స్వాతంత్ర్యం తర్వాత భారతదేశానికి చేసినటువంటి సేవలు, గొప్ప పనుల గురించి వివరించడం జరిగింది. ఈరోజు మన తెలంగాణ ప్రాంత వాసులు ఇలా ప్రశాంతంగా జీవిస్తున్నారు అంటే దానికి ముఖ్య కారణం పటేల్ అని, ఆ రోజుల్లో మన దేశానికి స్వాతంత్రం వచ్చాక మన దేశం సుమారుగా 565 సంస్థానాలుగా విడిపోయి ఉంటే వీటన్నిటిని ఏకం చేసి భారత దేశంలో విలీనం చేసి భారతదేశాన్ని అఖండంగా నిలబెట్టడంలో చాలా కృషి చేశారని తెలిపారు. వీరి యొక్క సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం వీరి యొక్క జయంతిని "ఏక్ తా దివస్" గా ప్రకటించడంతో పాటు, ప్రపంచంలో కెల్లా అత్యంత ఎత్తైన విగ్రహం నిర్మించడం కూడా చాలా గొప్ప విషయం అని, అదే విధంగా ఈ సంవత్సరం 150వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా వీరి యొక్క జయంతి కార్యక్రమాలు అధికారికంగా చేయడము చాలా గర్వకారణం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి గుండా గోపి, జిల్లా నాయకులు జనిగల శ్రీనివాస్ గౌడ్, కంటు నాగరాజు, పులి నరసింహారావు, బలవంత్ సింగ్, రాజు, రాధాకృష్ణ, మరియు తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment