Monday, November 17, 2025

నల్గొండ జిల్లా వినియోగదారుల సంఘాల సమన్వయ కమిటీ(డిసిసిసి) జిల్లా అధ్యక్షుడిగా అన్నేబోయిన మట్టయ్య నియామకం

నల్గొండ జిల్లా వినియోగదారుల సంఘాల సమన్వయ కమిటీ(డిసిసిసి) జిల్లా అధ్యక్షుడిగా అన్నేబోయిన మట్టయ్య నియామకం

నల్గొండ జిల్లా వినియోగదారుల సంఘాల సమన్వయ కమిటీ నూతన కార్యవర్గాన్ని నల్లగొండ జిల్లా కలెక్టరేట్ లోని డీసీఐసీ కార్యాలయంలో డి సి ఐ సి కన్వీనర్ చింతమళ్ళ గురువయ్య పర్యవేక్షణలో ఎన్నికల అధికారులు కట్టెకోల నరసింహారావు,డిసిసిసి గౌరవ అధ్యక్షులు/ క్యాట్కో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలె వెంకటేశ్వర్లు సమక్షంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. నల్గొండ జిల్లా వినియోగదారుల సంఘాల సమన్వయ కమిటీ నూతన జిల్లా అధ్యక్షుడిగా అన్నెబోయిన మట్టయ్య, జిల్లా ఉపాధ్యక్షులుగా ఎండి ఆస్మా, ఎండి ముస్తఫా, ఎండి నజీర్ పాషా, జిల్లా ప్రధాన కార్యదర్శిగా కట్ట మనోహర్, జిల్లా సహాయ కార్యదర్శులుగా తీరం దాసు ఆంజనేయులు పసునూరి రాంబాబు, జిల్లా ప్రచార కార్యదర్శి దువ్వ గీత, జిల్లా కోశాధికారిగా కొప్పోలు విమలమ్మ, డివిజన్ కార్యదర్శులుగా నల్గొండ పోలగాని వెంకటేశ్వర్లు మిర్యాలగూడ సిహెచ్ దేవరకొండ సాంబశివరావు రాపోలు శివకుమార్ చండూరు గండూరి నరసింహ, జిల్లా కార్యవర్గ సభ్యులుగా జూలూరు వెంకటేశం ఏమి రెడ్డి రవీందర్ రెడ్డి బత్తిని లక్ష్మయ్య పుట్టపర్తిని సత్యం ధనావత్ కౌసల్య లను ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకున్న నూతన కార్యవర్గానికి వినియోగదారుల సంఘాల ప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేశారు

No comments:

మనభూమి వార్త

హుజూర్ నగర్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

​హుజూర్ నగర్, మార్చి 7, 2026: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని బాలాజీ ఫంక్...

ఎక్కువమంది చూసినా వార్త