సామాన్య కార్యకర్తకు పట్టం కట్టిన భారతీయ జనతా పార్టీ* భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా సీనియర్ నాయకులు అయినటువంటి శ్రీ *నారపరాజు రామచందర్* గారిని ఏకగ్రీవంగా ఎన్నుకునందున హర్షం వ్యక్తం చేసి, వారికి శుభాభినందనలు తెలిపిన హుజూర్ నగర్ పట్టణ శాఖ. ఈ సందర్భంగా పట్టణ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో *బిజెపి పట్టణ అధ్యక్షులు కొండ హరీష్ గౌడ్* మాట్లాడుతూ మన సూర్యాపేట జిల్లా నల్లబండగూడెం గ్రామానికి చెందినటువంటి సామాన్య కార్యకర్తను రాష్ట్ర అధ్యక్షులుగా నియమించినందుకు జాతీయ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీ అంటే కార్యకర్తల పార్టీ అని, ఈ పార్టీలో పని చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు అవకాశం కల్పించేటువంటి పార్టీ అని, ఇది ప్రజల పార్టీ అని మరొక్కసారి రుజువయిందని తెలిపారు. ఈ పార్టీలో సుమారుగా 45 సంవత్సరాలుగా సామాన్య కార్యకర్తగా పని చేసుకుంటూ వస్తూ పార్టీ కోసం ఎంతో కష్టపడి, మావోయిస్టులకు వ్యతిరేకంగా పోరాడి, ఎన్నోసార్లు అరెస్టయి, లాఠీ దెబ్బలు తిన్నటువంటి కార్యకర్తకు ఈరోజు రాష్ట్ర అధ్యక్షులుగా అవకాశం కల్పించడం ఒక శుభ పరిణామం అని తెలిపారు. అదే విధంగా *రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ శ్రీ నారపరాజ రామచంద్ర రావు* గారి ఆధ్వర్యంలో రాబోయే రోజులలో పెద్ద ఎత్తున ప్రజా సమస్యలపై పోరాడి వారి నాయకత్వంలో రాబోయే రోజులలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు చింతలపూడి ఉమామహేశ్వరరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి గుండా గోపి, పట్టణ ఉపాధ్యక్షులు కొల్లోజు నాగేంద్ర చారి, పట్టణ కార్యదర్శి చుక్క హరీష్ మండల నాయకులు బలవంత్ సింగ్, బైరు సతీష్ మరియు పోలింగ్ బూత్ అధ్యక్షులతోపాటు కార్యకర్తలు పాల్గొన్నారు.
Thursday, July 3, 2025
సామాన్య కార్యకర్తకు పట్టం కట్టిన భారతీయ జనతా పార్టీ*
ఈ బ్లాగులో, మేము కేవలం వార్తలను అందించడం కాకుండా, వాటి వెనుక ఉన్న కథలను, దాగి ఉన్న కారణాలను, మరియు భవిష్యత్ పరిణామాలను విశ్లేషిస్తాం. రాజకీయాలు, సాంకేతికత, సామాజిక అంశాలు, చరిత్ర, మరియు ఇంకా ఎన్నో రంగాలలో "గూఢచారి" వలె పరిశోధించి, మీకు ఆసక్తికరమైన మరియు ఆలోచింపజేసే కంటెంట్‌ను అందిస్తాం.
Subscribe to:
Post Comments (Atom)
మనభూమి వార్త
హుజూర్ నగర్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
హుజూర్ నగర్, మార్చి 7, 2026: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని బాలాజీ ఫంక్...
ఎక్కువమంది చూసినా వార్త
-
ఐదు నెలలుగా జీతాలు రాక అల్లాడుతున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కుటుంబ పోషణకు అప్పుల పాలవుతున్నాం ఐదు నెలల జీతం చెల్లించేలా కలెక్టర్ ...
-
సూర్యాపేట జిల్లాలో రాబోయే మూడు రోజులు (ఆగస్టు 13 నుండి 15 వరకు) భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, జిల్లా యంత్ర...
No comments:
Post a Comment