Sunday, June 29, 2025
నరేంద్ర మోడీ *మన్ కి బాత్* కార్యక్రమాన్ని గోవిందపురం 223 పోలింగ్ బూతు
భారతీయ జనతా పార్టీ హుజూర్ నగర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రతి నెల చివరి ఆదివారం రోజున మన ప్రియతమ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు నిర్వహిస్తున్నటువంటి *మన్ కి బాత్* కార్యక్రమాన్ని గోవిందపురం 223 పోలింగ్ బూతులో పట్టణ కమిటీతో కలిసి పట్టణ అధ్యక్షులు కొండ హరీష్ గౌడ్ వీక్షించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కొండ హరీష్ గౌడ్ మాట్లాడుతూ ప్రధాన మంత్రివర్యులు ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప విషయమని, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మరియు దేశంలో జరుగుతున్న చిన్నచిన్న విషయాలపై సైతం ప్రత్యేక దృష్టి పెడుతున్న ప్రధానమంత్రి గారికి వారు కృతజ్ఞతలు తెలియజేస్తూ కార్యక్రమ విశిష్టతను గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి గుండా గోపి, ఉపాధ్యక్షుడు కొల్లోజు నాగేంద్ర చారి, కార్యదర్శి చుక్క హరీష్, గండూరి నరసింహారావు, పులి నరసింహారావు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
ఈ బ్లాగులో, మేము కేవలం వార్తలను అందించడం కాకుండా, వాటి వెనుక ఉన్న కథలను, దాగి ఉన్న కారణాలను, మరియు భవిష్యత్ పరిణామాలను విశ్లేషిస్తాం. రాజకీయాలు, సాంకేతికత, సామాజిక అంశాలు, చరిత్ర, మరియు ఇంకా ఎన్నో రంగాలలో "గూఢచారి" వలె పరిశోధించి, మీకు ఆసక్తికరమైన మరియు ఆలోచింపజేసే కంటెంట్‌ను అందిస్తాం.
Subscribe to:
Post Comments (Atom)
మనభూమి వార్త
హుజూర్ నగర్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
హుజూర్ నగర్, మార్చి 7, 2026: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని బాలాజీ ఫంక్...
No comments:
Post a Comment