Sunday, June 29, 2025

జూరాల,మంజీరా ప్రాజెక్టులపై బి.ఆర్.ఎస్ తప్పుడు ప్రచారం…

జోగులాంబా గద్వాల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండిజూరాల,మంజీరా ప్రాజెక్టులపై బి.ఆర్.ఎస్ తప్పుడు ప్రచారం…
జూరాల డ్యామ్ కు ప్రత్యామ్నాయ బ్రిడ్జికి 100 కోట్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
జూరాలకు ఎటువంటి ప్రమాదం లేదు ఇది రైతుపక్ష పాత ప్రభుత్వం-మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
జూరాల,మంజీరా ప్రాజెక్టుల పై బి.ఆర్.ఎస్ పార్టీ తప్పుడు ప్రచారానికి పాల్పడుతుందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.ప్రాజెక్టుల స్థితిగతులపై ఆ పార్టీ ప్రతినిధులు దురుద్దేశపురకంగా ప్రజలను తప్పు దోవ పట్టించేందుకు పర్సయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు.పదేళ్ళ బి.ఆర్.ఎస్ పాలనలో జరిగిన నిర్లక్ష్యం కారణంగానే ఇటువంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని ఆయన మండిపడ్డారుశనివారం రోజున సహచర మంత్రి వాకాటి శ్రీహరి,ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి,శాసనసభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి,మేఘారెడ్డి, పర్ణితా రెడ్డి,విజయుడు లతో పాటు ఏ.ఐ.సి.సి కార్యదర్శి సంపత్ కుమార్,మాజీ జడ్పి చైర్మన్ సరిత తిరుపతయ్య,కలెక్టర్ సంతోష్ కుమార్,నీటిపారుదల శాఖాధికారులతో కలసి ఆయన జూరాల ప్రాజెక్టును సందర్శించారు.అనంతరం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారుజూరాల రోప్ లు,స్ట్రోక్ గేట్ల గురుంచి వస్తున్న ఆరోపణలు పూర్తిగా సత్యదూరమని ఆయన కొట్టి పడేశారు.సాంకేతిక నిపుణులు అసలు అక్కడే సమస్యే లేదంటూ స్పష్టంగా దృవికరిస్తున్నారన్నారని ఆయన చెప్పారు.బి.ఆర్.ఎస్ పాలనలో జరిగిన తప్పిదాలను కప్పి పుచ్చుకోవడమే రైతులను తప్పుదారి పట్టించడంలో తల మునకలై ఉన్నారని ఆయన ఎద్దేవాచేశారు.పాత ప్రాజెక్టుల నిర్వహణతో పాటు కొత్తగా నిర్మిస్తున్న ప్రాజెక్ట్ ల నిర్వహణకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.జూరాల,మంజీరా,ఎస్.ఆర్.ఎస్.పి,కల్వకుర్తి, భీమా వంటి ప్రాజెక్టులను పునరుద్ధరణకు శ్రీకారం చుట్టామన్నారు.వాటిలో పాలమూరు రంగా రెడ్డి ఎత్తిపోతల పధకం పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత నిచ్చి వేగవంతంగా పూర్తి చేసేందుకు సంకల్పించినట్లు ఆయన వెల్లడించారు.గడిచిన పదేళ్ళ వ్యవధిలో ఏనాడు నాటి పాలకులు ఆపరేషన్&మెయింట్ నెన్స్ లేనే లేదన్నారు. పైగా పూడిక తీత పనులు చేపట్టక పోవడంతో జూరాల ప్రాజెక్టులో నీటి సామర్ధ్యం 20 నుండి 25 శాతం మేర తగ్గిపోయిందన్నారు.కేవలం కమిషన్లకు కట్టుబడి కాళేశ్వరం ప్రాజెక్టు పెరోతో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాత ప్రాజెక్టులను గాలికి వదిలిన చరిత బి.ఆర్.ఎస్ పాలకులకు దక్కిందని ఆయన దుయ్యబట్టారు.అంతెందుకు ఇదే జూరాల డ్యామ్ మీద భారీ నుండి అతి భారీ వాహనాలు ప్రయాణించడం ప్రమాదకరమని డ్యామ్ సేఫ్టీ అధికారులు హెచ్చరిస్తున్నా బేఖాతరు చేసిన ఘనత బి.ఆర్.ఎస్ పాలకులదని ఆయన విమర్శించారు.అటువంటి డ్యామ్ కు భవిష్యత్ లో ఎటువంటి నష్టం వాటిల్లకూడదన్న కోణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్యామ్ కు ప్రత్యామ్నాయంగా బ్రిడ్జి నిర్మాణం కోసం ఇప్పటికిప్పుడు 100 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారన్నారు.ప్రాజెక్టులో నీటి సామర్ధ్యం పెంచేందుకు గాను పూడిక తీత పనులకు నిర్ణయం తీసుకున్నామన్నారు.అదే విదంగా రేలంపాడు రిజర్వాయర్ లో 4 టి.యం.సి ల నీటి నిల్వ పనులు ప్రారంభించామన్నారు.మల్లమ్మకుంట పనులు త్వరలోనే పూర్తి చేస్తామన్నారు.నెట్టెంపాడు ప్రాజెక్టును 90 శాతం పనులు పూర్తి అయినా మిగిలిన 10 శాతం పనులను గత ప్రభుత్వం పూర్తి చేయడంలో వైఫల్యం చెందిందన్నారు.నిర్మాణపు అంచనాలను పునరుద్ధరించి 2,753 కోట్లతో డిసెంబర్ మాసంతానికి పూర్తి చేసే లక్ష్యంతో పనులు ముందుకు సాగుతున్నాయన్నారుమక్తల్ నియోజకవర్గ పరిధిలో పెండింగ్ పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు.రాష్ట్ర పశుసంవర్ధక శాఖామంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ జూరాల నుండి ఒకేసారి 12 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన రోజులు ఉన్నాయని ప్రస్తుతం వదిలింది లక్ష క్యూసెక్కుల నీరు మాత్రమే నని స్పష్టం చేశారు.జూరాల ప్రాజెక్టుకు వచ్చిన ముప్పు ఏమి లేదని తాము కట్టిన కాళేశ్వరం తాము అధికారంలో ఉండగానే కూలిపోవడంతో దిక్కు తోచని బి.ఆర్.ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయడంతో పాటు ప్రజలను తప్పు దోవ పట్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

No comments:

మనభూమి వార్త

హుజూర్ నగర్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

​హుజూర్ నగర్, మార్చి 7, 2026: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని బాలాజీ ఫంక్...

ఎక్కువమంది చూసినా వార్త