హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు *పట్టణ అధ్యక్షులు కొండ హరీష్ గౌడ్* అధ్యక్షతన పట్టణ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో భాగంగా అధ్యక్షులు పట్టణ బిజెపి కమిటీని ప్రకటించడం జరిగింది.
*పట్టణ బిజెపి కమిటీ*
ఉపాధ్యక్షులు: విజయ్ పైడమర్రి, కొల్లోజు నాగేంద్ర చారి.
జనరల్ సెక్రెటరీ: గుండా గోపి,
కార్యదర్శులు: గుగులోతు రవి, చుక్కా హరీష్,
కార్యవర్గ సభ్యులు: యల్లావుల సోమరాజు, పంగా రమేష్, బైరు సతీష్, బల్వంత్ సింగ్, పులి నరసింహ, బత్తుల ఉపేందర్, గుండా నాగరాజు, కామళ్ళ వంశీ, అయిల సిసింద్రీ, రంగనాథ్ నియమించడం జరిగింది.
ఈ కమిటీ తక్షణం అమల్లోకి వస్తుందని అధ్యక్షులు తెలిపారు. అలాగే ఈ సమావేశంలో *భారతీయ జనతా పార్టీ టౌన్ అధ్యక్షులు కొండా హరీష్ గౌడ్* మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి కార్యకర్త కూడా పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం కృషి చేయాలని అలాగే పార్టీ ఇచ్చినటువంటి భవిష్యత్తు కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని కోరారు. అలాగే రాబోయేటువంటి మునిసిపల్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అన్ని వార్డ్ లలో పోటీ చేస్తుందని అలాగే రాష్ట్రంలో అధికార పార్టీ మరియు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యాయని, అదే విధంగా భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే అని తెలిపారు. అందుకు ప్రతి ఒక్క కార్యకర్త కూడా కృషి చేయాలని కోరారు.

No comments:
Post a Comment