Friday, June 27, 2025

బిజెపి హుజూర్ నగర్ టౌన్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో లో ...కే నామ్ ఏక్ పేడ్... మొక్కను నాటే కార్యక్రమం

పర్యావరణ పరిరక్షణలో భాగంగా మన ప్రియతమ ప్రధానమంత్రి గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపుమేరకు ప్రతి పోలింగ్ బూత్ లో *'మా కే నామ్ ఏక్ పేడ్' అమ్మ పేరుతో ఒక మొక్క* కార్యక్రమంలో భాగంగా 209 పోలింగ్ బూత్ ఎన్జీవోస్ కాలనీలో ఈరోజు భారతీయ జనతా పార్టీ హుజూర్ నగర్ పట్టణ అధ్యక్షులు కొండ హరీష్ గౌడ్ మరియు పట్టణ కమిటీ అందరూ కలిసి మొక్కను నాటడం జరిగింది. ఈ సందర్భంగా కొండ హరీష్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా మొక్కలను నాటాలని నాటడమే కాదు వాటిని సరిగా పెంచడంతో వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని తెలిపారు. ప్రస్తుతం వాతావరణంలో కాలుష్య శాతం బాగా పెరిగిపోయిందని ఇలానే ఉంటే భవిష్యత్తులో మనము గాలిని సైతం కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని అది రాకూడదంటే మనం మనం పరిసరాలను కాపాడుకోవాలని మొక్కలను పెద్ద ఎత్తున నాటి వాటిని పెంచినట్లయితే మనము ఆరోగ్యంగా ఉండటంతో పాటు, ఆరోగ్యమైన జీవితం గడపడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి గుండా గోపి, ఉపాధ్యక్షులు పైడిమర్రి విజయ్, నాగేంద్ర చారి మండల నాయకులు చుక్క హరీష్, బత్తుల ఉపేందర్, బల్వంత్ సింగ్, యల్లావుల సోమరాజు తదితరులు పాల్గొన్నారు.

1 comment:

Anonymous said...

Nice

మనభూమి వార్త

హుజూర్ నగర్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

​హుజూర్ నగర్, మార్చి 7, 2026: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని బాలాజీ ఫంక్...

ఎక్కువమంది చూసినా వార్త