పోకల వెంకటేశ్వర్లు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలలో, రైతు భరోసా గాని, రుణమాఫీ గాని,పూర్తిగా రైతులందరికీ అమలు చేయకుండా, అమలు చేసినట్లుగా తొండి మాటలు చెప్పటం రాష్ట్ర ప్రభుత్వానికి తగదని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోకల వెంకటేశ్వర్లు అన్నారు. ఆయన ఈరోజు గరిడేపల్లి మండల కేంద్రంలో పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అమలు చేయక పోవడం వలన ఇంకా కొన్ని వేల మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారని,అయినా కూడా రుణమాఫీ పూర్తి చేసినట్టుగా చెప్పుకోవడం, అలాగే రైతు భరోసా పైసలను తాను అధికారంలోకి వచ్చిన తర్వాత పోయిన వానాకాలం ఒక కారు అందరి రైతులకు కూడా రైతు భరోసా వేయలేదని, వేసంగి కారుకి కేవలం మూడున్నర ఎకరాల రైతుల వరకే రైతు భరోసా వేసి మిగతా రైతులకు వేయకుండా మోసం చేసినారని, ఇప్పుడు కేవలం స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలని ఉద్దేశంతో రైతుబంధు వేస్తున్నారని పాలకులకు ఇది తగదని, పాలకులకు ఒక స్పష్టమైన విధానం వుండాలని,చేస్తే చేస్తమనాలి తప్ప, ఆశలలో ఉంచటం మంచిది కాదని, రుణమాఫీ లో రెండు లక్షలు పైన తీసుకున్న పై పైసలు చెల్లిస్తే ప్రభుత్వం వెంటనే వారి అకౌంట్ లలో రెండు లక్షలు జమ చేస్తామని సాక్షత్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు కూడా అమలు కాలేదని, రైతులు కూడా మీరు రుణమాఫీ చేస్తామన్న రెండు లక్షలు రూపాయలు మాత్రమే అడుగుచున్నారు తప్ప వేరే ఏ గోంతెమ్మ కోర్కెలు కోరటం లేదని ఆయన అన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా, రుణమాఫీ 2 లక్షల రూపాయలు వరకు చేసి,అలాగే యాసంగి ఎవరికైతే రైతులకు రైతు భరోసా వేయలేదో, వారందరికీ రైతు భరోసా పైసలను వారి ఖాతాలలో జమ చేసిన తర్వాత తాము ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చినామని చెప్పుకుంటే బాగుంటుందని, దానిని ప్రజలు రైతులు కూడా హర్షిస్తారని ఆయన అన్నారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఏ ఒక్క గ్యారెంటీ ని పూర్తిగా అమలు చేయలేక చతికల పడటం బాధాకరమని, గత పాలకులు అప్పులు చేయటం వల్ల మేము ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేక పోతున్నామని చెప్పుకోవడం ఇంకా బాధాకరమని, ఎన్నికల సమయంలో రాష్ట్ర రాష్ట్ర ఆదాయం, అప్పుల పై అవగాహన లేకుండా వాగ్దానాలు ఎలా చేశారని ఆయన ప్రశ్నించారు.
ఇప్పటికైనా ప్రజలకిచ్చిన 6 ఆరు గ్యారంటీలను అమలు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి కడియాల అప్పయ్య, సిపిఐ మండల కార్యవర్గ సభ్యులు, కుందూరు వెంకటరెడ్డి,
పోకల ఆంజనేయులు, నర్సింహారావు,తిరపయ్య,పంగ సైదులు, ఈశ్వరా చారి, షైక్ నబిసాహెబ్, పీరిసాహెబ్, వెంకటేశ్వర్లు, అచ్చయ్య,
ఎంకన్న,
తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment