ఐఎన్టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎరగని నాగన్న గౌడ్ పిలుపు ................................................
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి కార్మికులు సాధించుకున్న హక్కులను కాలరాస్తుందని ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగన్న గౌడ్ అన్నారు. సోమవారం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఐఎన్టియుసి నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జులై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో దేశంలో అన్ని ట్రేడ్ యూనియన్లు కలసి పాల్గొనున్నాయని ఆయన అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ కొమ్ముకాస్తుందన్నారు. జులై 9న జరిగే సార్వత్రిక సమ్మెలో ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. రాష్ట్రంలోని INTUC ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు. ఐ ఎన్ టి యూ సి జాతీయ అధ్యక్షులు డాక్టర్ సంజీవరెడ్డి అధ్యక్షతన కేంద్రం లోని ట్రేడ్ యూనియన్లు కలిసి సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఆయన కోరారు................................................ ఈకార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తన్నిర్ మల్లిఖార్జున్.. INTUC జిల్లా అధ్యక్షులు ఆలకుంట్ల బాలక్రిష్ణ.. INTUC నియోజకవర్గ అధ్యక్షులు బెల్లంకొండ గురువయ్య.. INTUC మండల అధ్యక్షులు మేళ్ళచెరువు ముక్కంటి.. INTUC పట్టణ అధ్యక్షులు పాశం రామరాజు యాదవ్.. INTUC జిల్లా సహాయ కార్యదర్శి చింతకాయల రాము.. రైస్ మిల్ల్ డ్రైవర్స్ యూనియన్ సలిగంటి జానయ్య. INTUC జిల్లా నాయకులు కత్తుల రవీందర్.. ఫ్రూట్ మర్చంట్ యూనియన్ అధ్యక్షులు మద్దం నాగేందర్.. INTUC నియోజకవర్గ మహిళ అధ్యక్షురాలు కల్లు గీత కార్మిక సంఘం యూనియన్ అధ్యక్షులు పాలకూరి లాలు గౌడ్ చప్పిడి సావిత్రి.. మండల మహిళా అధ్యక్షురాలు గడ్డం వెంకటమ్మ.. పాలకిడు మండల అధ్యక్షులు శ్రీను యాదవ్.. లైట్ మోటార్స్ యూనియన్ అధ్యక్షులు ఏదుల నరసింహారావు.. షేక్ ముస్తాఫా.. శ్రీను.తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment