ఆర్థిక సంక్షోభంలో ఉన్న భారతదేశాన్ని ధైర్యంగా ముందుకు నడిపించి, సంస్కరణల బాటలో నిలిపిన మహనీయుడు. మెజారిటీ లేకున్నా, తన దార్శనికతతో ఐదేళ్లపాటు స్థిరంగా పాలన అందించి, దేశ ఆర్థిక విధానాల్లో మూల ప్రణాళికలు అమలు చేసిన గొప్ప మేధావి. ఆయన తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు దేశానికి దిక్సూచి అయ్యాయి.
భారతరత్న “పాములపర్తి వెంకట నరసింహారావు” జయంతి సందర్భంగా ఈ మహనీయుడిని స్మరించుకోవడం తెలుగు ప్రజలందరికి గౌరవకరమైన క్షణం. తెలుగుజాతికి ప్రాతఃస్మరణీయుడుగా, చిరస్మరణీయుడిగా నిలిచే నరసింహారావు గారు దేశానికి ప్రేరణగా నిలిచారు. ఆయన సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి.
"కవితారసపుజల్లు,
ఖడ్గాల గలుగల్లు,
కరణాలకే చెల్లు,
ఓ కూనలమ్మా !!"
తెలుగుతేజం
కీర్తి శేషులు
శ్రీ పాములపర్తి వెంకట నరసింహారావు గారి జయంతి సందర్భంగా
మనః పూర్వక నివాళి !!
No comments:
Post a Comment