Wednesday, July 2, 2025

సార్వత్రిక సమ్మెలో సకల జనులు పాల్గొని విజయవంతం చేయాలి శీతల రోషపతి

సార్వత్రిక సమ్మెలో సకల జనులు పాల్గొని విజయవంతం చేయాలి శీతల రోషపతి.
హుజూర్నగర్ లో స్కీం వర్కర్స్ ఆశ మిడ్డి మిల్స్ సమ భావన గ్రూపు సంఘాలు ఉపాధి హామీ పథకం అంగన్వాడి తదితర మహిళా సంఘాల విస్తృత సమావేశంలో రోషపతి పాల్గొని మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడి రిటైర్మెంట్ బెనిఫిట్ పెంచడం మిగతా వర్కర్స్ కు పెంచకపోవడంతో తక్షణమే మిగతా వారికి కూడా పెంచి బెనిఫిట్స్ స్కీమ్ ఉద్యోగ భద్రత కల్పించాలని ఉపాధి హామీ కూలీలకు రోజుకు 600 రూపాయలు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళలని కోటీశ్వరులను చేస్తానని  పెద్దపెద్ద మాటలు మాట్లాడిన రేవంత్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అడుగుపెడుతున్న ఈరోజు వరకు ఇస్తానన్న గ్యాస్ బండకి 500 రూపాయలు సబ్సిడీ ఇస్తానని ఇంతవరకు అందట్లేదని మహిళా కార్మికులు వాపోయారు తక్షణ అమలు అయ్యేటట్టు చూడండి లేకుంటే రాబోయే స్థానిక ఎన్నికలలో ఈ ప్రభావం తప్పనిసరిగా ఉంటుందని రోషపతి అన్నారు.

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వివిధ రూపాల్లో కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాల్ని రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ లుగా మార్చటం అన్యాయమని అది ఇప్పుడు విస్తృతంగా అమలు చేయాలని ప్రయత్నించడం ఘోరమని తక్షణమే లేబర్ కోడ్ లను రద్దు చేయాలని లేకుంటే ఢిల్లీలో రైతుల పోరాటం వల్ల కొన్ని రాష్ట్రాలు ప్రభుత్వాలు మార్పు జరిగాయో రైతు ఉద్యమాలల్ల ఎలా వచ్చిందో ఈ కార్మిక ఉద్యోగులు పోరాటంలో కూడా కేంద్ర బిజెపి ప్రభుత్వం మార్పుకి బాటసగా మారుతుందని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
హుజూర్నగర్లో ఫణిగిరి రామస్వామి గుట్ట వద్ద  ఇందిరమ్మ ఇండ్లుని అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో పంచుతామన్నారు ఇప్పుడు సంవత్సరం దాటిన ఒక ఇల్లు పంచలేదని  ఇప్పుడైనా పంచాలని మహిళలు కోరుతున్నారని ఈనెల తొమ్మిదో తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెలో ప్రతి ఒక్క మహిళ ఉద్యోగి స్కీం వర్కర్స్ పాల్గొని విజయవంతం చేయాలని కోరినారు. ఈ కార్యక్రమంలో టిఎన్టియుసి నాయకులు గుండెబోయిన వెంకన్న మంగమ్మ పద్మ చంద్రకళ స్వరూప నాగమణి ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.

No comments:

మనభూమి వార్త

హుజూర్ నగర్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

​హుజూర్ నగర్, మార్చి 7, 2026: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని బాలాజీ ఫంక్...

ఎక్కువమంది చూసినా వార్త