సూర్యాపేట తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ వారు ఖమ్మం జిల్లాలోని టీటీడీసీ ట్రైనింగ్ సెంటర్ నందు నిర్వహించిన తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీజేఏ) రాష్ట్ర సమావేశానికి సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా ఆధ్వర్యంలో టీజేఏ సూర్యాపేట జిల్లా కమిటీ సభ్యులు హాజరయ్యారు.
ఈ సమావేశంలో టీజేఏ వ్యవస్థాపక అధ్యక్షులు ఉప్పల లక్ష్మణ్, టీజేఏ రాష్ట్ర అధ్యక్షుడు రమణారావు మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలో టీజేఏ యూనియన్ బలంగా పనిచేస్తుందని ప్రశంసించారు. హుజూర్నగర్, కోదాడ, సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలలో కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యులు మరియు ఖమ్మం జిల్లా నూతన కమిటీ సభ్యులు సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు షేక్ సైదాను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా అధ్యక్షులు వాసుదేవ రావు తో పాటు సూర్యాపేట జిల్లా తరఫున కొత్తపల్లి మధు, కొల్లోజు నాగేంద్ర చారి, భీమపంగు వెంకటేశ్వర్లు, గోరంట్ల శ్రీనివాస్, కొమ్ము మహేష్, పెందుర్తి సతీష్, బయ్యారపు రవీంద్ర, షేక్ నాగుల్ మీరా, మక్బూల్ పాషా తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment