Sunday, July 27, 2025

హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావును కలిసిన హుజూర్‌నగర్ నాయకులు

*హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావును కలిసిన హుజూర్‌నగర్ నాయకులు*
ఈరోజు హైదరాబాద్‌లోని హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ పల్లె నాగేశ్వరరావు గారి నివాసంలో హుజూర్‌నగర్ నుంచి పలువురు నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.
హుజూర్‌నగర్‌లోని తిలక్ నగర్ 14వ, 15వ వార్డులకు చెందిన ఎస్సీ సెల్ మాల మహానాడు నియోజకవర్గ ముఖ్య నాయకులు, బీసీ సంఘం నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తమ రెండు వార్డుల యోగక్షేమాల విషయమై వీరు నాగేశ్వరరావు గారితో చర్చించినట్లు సమాచారం.
ఈ కార్యక్రమంలో హాజరైన ముఖ్య నాయకులలో మాల మహానాడు జిల్లా కో కన్వీనర్ కోలపూడి దయాకర్, మాల మహానాడు నియోజకవర్గ అధ్యక్షులు దగ్గుపాటి బాబురావు, మాల మహానాడు నియోజకవర్గ ఉపాధ్యక్షులు కొల్లపూడి శ్రీనాథ్ చంటి, మాల మహానాడు నియోజకవర్గ నాయకుడు మామిడి వసంత్ కుమార్, బీసీ సెల్ నియోజకవర్గ నాయకుడు అలవాల ఉపేందర్, మాల మహానాడు టౌన్ నాయకుడు దగ్గుపాటి సురేష్ తదితరులు ఉన్నారు.

No comments:

మనభూమి వార్త

హుజూర్ నగర్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

​హుజూర్ నగర్, మార్చి 7, 2026: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని బాలాజీ ఫంక్...

ఎక్కువమంది చూసినా వార్త