హుజూర్‌నగర్, జూలై 18, 2025: సుమారు 100 సంవత్సరాలు జీవించి, ముగ్గురు కుమారులు మరియు ఐదుగురు కుమార్తెలకు జన్మనిచ్చిన నగెల్లి కృపమ్మ నిన్న మరణించారు. ఆమె తన కుమారులు, కోడళ్ల వివాహాలు చూసి ఈ లోకాన్ని విడిచిపెట్టారు.
ఈ విషయం తెలుసుకున్న మాస్తిని కుల రాష్ట్ర అధ్యక్షులు నాగెల్లి నర్సయ్య గారు కృపమ్మ పార్థివ దేహానికి పూలమాలలు వేసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ, రూ. 2000 ఆర్థిక సహాయం కూడా అందించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగెల్లి క్రిస్తయ్, రాష్ట్ర కన్వీనర్ బుద్దుల రమేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు పొన్నల అంజి, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మరియు సూర్యాపేట జిల్లా అధ్యక్షులు డి. రాములు, కోదాడ మండల అధ్యక్షుడు నగెళ్ళి వెంకటేష్, నల్గొండ జిల్లా అధ్యక్షుడు నగెళ్లి నాగయ్య, మునగాల మండల అధ్యక్షుడు దర్శనం వెంకన్న, మరియు మండల ప్రధాన కార్యదర్శి నాగెళ్ళి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment