Friday, July 18, 2025

హుజూర్ నగర్‌లో ఘనంగా జగదీశ్ రెడ్డి జన్మదిన వేడుకలు

 


హుజూర్ నగర్‌లో ఘనంగా జగదీశ్ రెడ్డి జన్మదిన వేడుకలు

హుజూర్ నగర్ బి.ఆర్.ఎస్. నాయకుల ఆధ్వర్యంలో మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మాజీ జెడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ అమర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.


ప్రత్యేక పూజలు, కేక్ కటింగ్, పండ్లు పంపిణీ

జగదీశ్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని హుజూర్ నగర్‌లోని కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో ఆయన పేరున ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పాత బస్టాండ్ దగ్గర ఉన్న అమరవీరుల స్తూపం సెంటర్ వద్ద కేక్ కట్ చేసి జగదీశ్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్, పండ్లు పంపిణీ చేశారు.


జగదీశ్ రెడ్డి సేవలను కొనియాడిన బి.ఆర్.ఎస్. నాయకులు

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నమైన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జగదీశ్ రెడ్డి కీలక పాత్ర పోషించారని కొనియాడారు. స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా, ఉద్యమమే ఊపిరిగా ఉమ్మడి నల్లగొండ జిల్లా ఉద్యమ నిర్మాణంలో పనిచేశారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్లపాటు మంత్రిగా ఉండి చేసిన అభివృద్ధి పనులను వివరించారు:

  • 4 వేల మెగావాట్స్ సామర్థ్యం గల యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం.

  • పరిపాలనా సౌలభ్యం కోసం యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల ఏర్పాటు.

  • మూడు జిల్లాల్లో మెడికల్ కళాశాలల ఏర్పాటు.

  • యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం.

  • కొత్త జిల్లాల్లో నూతన కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలు, గురుకుల పాఠశాలలు, కళాశాలల ఏర్పాటు.

  • ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలను పట్టిపీడిస్తున్న ఫ్లోరిన్ భూతాన్ని తరిమివేసి, ఇంటింటికి కృష్ణా జలాలను అందించడం. దీని ద్వారా ఆయనలోని గొప్ప మానవీయ కోణం యావత్ తెలంగాణ సమాజానికి తెలిసిందని, అందరూ అభినందించారని పేర్కొన్నారు.

  • కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను జిల్లాకు తీసుకొచ్చి తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాలకు సాగునీరు అందించడంతో పాటు, జిల్లాలో రెండు లక్షల 50 వేల ఎకరాల కొత్త ఆయకట్టును సాగులోకి తీసుకొచ్చి ఉమ్మడి నల్లగొండ జిల్లాను తెలంగాణ ధాన్యగారంగా మార్చిన ఘనత జగదీశ్ రెడ్డికే దక్కుతుందని తెలిపారు.

  • సూర్యాపేట జిల్లా కేంద్రాన్ని ఊహించని విధంగా అభివృద్ధి చేసి ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంచారన్నారు.


పార్టీకి పెద్దదిక్కుగా జగదీశ్ రెడ్డి

2023లో బి.ఆర్.ఎస్. పార్టీ అధికారం కోల్పోయినప్పటికీ, సూర్యాపేట నుండి ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించడం గొప్ప విషయమని నాయకులు పేర్కొన్నారు. నాటి ఉద్యమ సమయం నుండి నేటి ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పటికీ, ఉమ్మడి నల్లగొండ జిల్లా పార్టీకి పెద్దదిక్కుగా ఉండి, పార్టీ క్యాడర్‌ను, నాయకులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారని కొనియాడారు. రానున్న రోజుల్లో జగదీశ్ రెడ్డి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రజా జీవితంలో ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు.


కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు

ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ కే.ఎల్.ఎన్ రెడ్డి, బి.ఆర్.ఎస్. మండల పార్టీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ అబ్దుల్ నబీ, సారెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ సర్పంచులు అన్నెం శిరీష కొండారెడ్డి, గుజ్జుల సుజాత అంజిరెడ్డి, కీత జయమ్మ ధన మూర్తి, గల్లా సైదులు, అద్దంకి సైదీశ్వరరావు, షేక్ అలీ, పల్లె నాగిరెడ్డి, మాజీ పీఏసీఎస్ చైర్మన్ కామిశెట్టి వెంకటేశ్వర్లు, రెక్కల శాంబిరెడ్డి, రామిశెట్టి రాము, పారేపల్లి నరసింహారావు, మండల నాయకులు సామల మట్టారెడ్డి, తోట బిక్షం, మల్లెపల్లి నరసింహారావు, కాసర్ల నాగేశ్వరరావు, సాతులూరు వెంకటేశ్వర్లు, లక్క వెంకన్న, పంగ నరసింహారావు, చంద్రగిరి రాము, గిన్ రెడ్డి వెంకట్ రెడ్డి, మేరుగా గురవయ్య, రవీందర్, అల్వాల తమ్మిశెట్టి, జయరాం, నరేష్, చంటి, వసంత్, కొరివిరయ్య, సత్యనారాయణ, రాజశేఖర్, వెంకటేష్, నాగరాజు, దుండిగల్ మల్లేష్, చామకూర అంజి, భాస్కర్ తోరక, నరసింహారావు, పల్లె సంతోష్ రెడ్డి, వినాయక రావు, భూతం గిరి, ఎస్కే సైదా, రాము, మహేష్, దుర్గ ప్రసాద్, వేముల అఖిల్, యూత్ నాయకులు సుందరయ్య, భాస్కర్ రెడ్డి, కృష్ణమోహన్, గండు సైదులు, మాడుగుల పరశురాం, నాగరాజు, దగడు గోపి, లోకేష్ బాబు, దుగ్గి నరసింహారావు, రాము, చడపంగు వెంకటేశ్వర్లు, సీతారాం రెడ్డి, ఎండి ముజీబ్, రమేష్, సుధీర్ రెడ్డి, ఉదయ్ భాస్కర్, మహమ్మద్, ఆకుల పుల్లయ్య, సుందర్, దశరథ, వంశీ, రత్నశ్రీ, రహిమా బేగం, పెద్ద పుష్ప, ఉష, ప్రతి కంఠం భారతి, జూలకంటి రామలక్ష్మమ్మ, లక్ష్మి, నాగమణి, భవాని తదితరులు పాల్గొన్నారు.

No comments:

మనభూమి వార్త

హుజూర్ నగర్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

​హుజూర్ నగర్, మార్చి 7, 2026: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని బాలాజీ ఫంక్...

ఎక్కువమంది చూసినా వార్త