Saturday, August 9, 2025

తెలంగాణ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (TJA) సూర్యాపేట జిల్లా లో పాలకీడు, నేరేడుచర్ల మండలాలకు అధ్యక్షుల నియామకాలు

సూర్యాపేట జిల్లాలోని పాలకీడు, నేరేడుచర్ల మండలాలకు తెలంగాణ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (TJA) అధ్యక్షులను నియమించినట్లు ఆ సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.
ఈ మేరకు టీజేఏ రాష్ట్ర కమిటీ ఆమోదం, సూర్యాపేట జిల్లా కమిటీ తీర్మానం ప్రకారం పాలకీడు మండల అధ్యక్షుడిగా షేక్ నాగుల్ మీరాను, నేరేడుచర్ల మండల అధ్యక్షుడిగా పాశం లూకాస్‌ను నియమిస్తూ నియామక పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా షేక్ సైదా మాట్లాడుతూ పాలకీడు, నేరేడుచర్ల మండలాల్లో టీజేఏ యూనియన్‌ను బలోపేతం చేయాలని, కమిటీల ఏర్పాటును త్వరగా పూర్తి చేయాలని కొత్తగా నియమితులైన అధ్యక్షులను ఆదేశించారు. యూనియన్ సమావేశాలకు హాజరవుతూ జర్నలిస్టుల హక్కుల సాధన, సంక్షేమం కోసం పనిచేయాలని కోరారు.
తమపై నమ్మకంతో ఈ పదవులు అప్పగించిన టీజేఏ జిల్లా కమిటీకి, జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా, వ్యవస్థాపక అధ్యక్షుడు ఉప్పల లక్ష్మణ్, రాష్ట్ర అధ్యక్షుడు కదిరి వెంకటరమణ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉక్కల్ కర్ రాజేందర్ నాథ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ఆర్. ఘోరీలకు నూతన అధ్యక్షులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీజేఏ సూర్యాపేట జిల్లా కమిటీ కోశాధికారి కొత్తపల్లి మధుసూదన్, జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యుడు కొల్లోజు నాగేంద్ర చారి, మేళ్లచెరువు మండల అధ్యక్షుడు కొమ్ము మహేష్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

మనభూమి వార్త

హుజూర్ నగర్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

​హుజూర్ నగర్, మార్చి 7, 2026: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని బాలాజీ ఫంక్...

ఎక్కువమంది చూసినా వార్త