Friday, August 8, 2025

తెలంగాణ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (TJA) మేళ్లచెరువు మండల అధ్యక్షుడిగా కొమ్ము మహేష్ నియామకం

తెలంగాణ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (TJA) మేళ్లచెరువు మండల అధ్యక్షుడిగా కొమ్ము మహేష్ నియామకం
తెలంగాణ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (TJA) సూర్యాపేట జిల్లా కమిటీ తీర్మానం మేరకు మేళ్లచెరువు మండల అధ్యక్షుడిగా కొమ్ము మహేష్ నియమితులయ్యారు. ఈ నియామకానికి సంబంధించిన ఉత్తర్వుల ప్రతిని శుక్రవారం హుజూర్ నగర్ లోని జిల్లా కమిటీ ప్రెస్ క్లబ్ లో TJA సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా అందజేశారు.
ఈ సందర్భంగా షేక్ సైదా మాట్లాడుతూ, మేళ్లచెరువు మండలంలో TJA కమిటీలను ఏర్పాటు చేయాలని, యూనియన్ సమావేశాలకు హాజరవుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కొమ్ము మహేష్ ను కోరారు.
కొమ్ము మహేష్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించిన సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా, వ్యవస్థాపక అధ్యక్షులు ఉప్పల లక్ష్మణ్, TJA అధ్యక్షులు కదిరి వెంకటరమణ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉక్కల్ కర్ రాజేందర్ నాథ్ కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో TJA సూర్యాపేట జిల్లా కమిటీ కోశాధికారి కొత్తపల్లి మధుసూదన్, జిల్లా కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కొల్లోజు నాగేంద్ర చారి, బయ్యారపు రవీంద్ర, హుజూర్ నగర్ మండల అధ్యక్షులు కొండమీది నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

No comments:

మనభూమి వార్త

హుజూర్ నగర్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

​హుజూర్ నగర్, మార్చి 7, 2026: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని బాలాజీ ఫంక్...

ఎక్కువమంది చూసినా వార్త