Tuesday, September 16, 2025

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి ఎంఆర్‌పిఎస్ తరపున జన్మదిన శుభాకాంక్షలు

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి ఎంఆర్‌పిఎస్ తరపున జన్మదిన శుభాకాంక్షలు
హైదరాబాద్: భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ తరపున ఎంఆర్‌పిఎస్ నాయకులు శ్రీ నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా, ఎంఆర్‌పిఎస్ జిల్లా అధికార ప్రతినిధి ఏపూరి సత్యరాజు మాదిగ మాట్లాడుతూ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ అభివృద్ధికి, పేదల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ఆయన నాయకత్వంలో భారతదేశం అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన ప్రగతిని సాధిస్తోందని ప్రశంసించారు. ఆయనకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు.
ఇట్లు,
ఏపూరి సత్యరాజు మాదిగ
జిల్లా అధికార ప్రతినిధి
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS)

No comments:

మనభూమి వార్త

హుజూర్ నగర్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

​హుజూర్ నగర్, మార్చి 7, 2026: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని బాలాజీ ఫంక్...

ఎక్కువమంది చూసినా వార్త