సంప్రదాయ ఇస్లామిక్ విద్య అభ్యసించాడు.అతని విద్య ఇంట్లోనే సాగింది.మొదట తండ్రి,పిదప ఉపాధ్యాయులు ఇంట్లోనే బోధించారు. ఆజాద్ మొదట అరబిక్, పెర్షియన్ నేర్చుకున్నాడు. తరువాత తత్వశాస్త్రం, రేఖాగణితం, గణితం, బీజగణితం అభ్యసించాడు. స్వీయ అధ్యయనం ద్వారా ఇంగ్లీష్, ప్రపంచ చరిత్ర, రాజకీయాలు నేర్చుకున్నాడు.ఆజాద్ మౌలానా అగుటకు కావలసిన మత శిక్షణ పొందాడు.అతను దివ్య ఖురాన్ పై భాష్యం వ్రాసాడు. 16 సంవత్సరాల వయసులో లిసానస్ సిదిక్ (సత్యవాణి) అనే పత్రికను స్థాపించి శాంతి మరియు మత సామరస్యం గురించి సందేశాలను ప్రచారం చేయడం కోసం పత్రిక ద్వారా ఆయన తన భావాలను, ఆలోచనలను ప్రజల్లోకి తీసుకువెళ్లారు. 1912 లో ఉర్దూలో ‘అల్ హిలాల్’ అనే వార పత్రిక ముస్లింల మధ్య విప్లవాత్మక భావాలను పెంచడానికి ప్రారంభించారు. అల్ హిలాల్ మోర్లే-మింటో సంస్కరణల ఫలితంగా రెండు వర్గాల మధ్య చెలరేగిన సంఘర్షణల తర్వాత హిందూ మతం-ముస్లిం వర్గాల మద్య ఐక్యత కుదుర్చటంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది. ‘అల్ హిలాల్’ అతివాద భావనల ఒక విప్లవాత్మక ధ్వనిగా మారింది. ప్రభుత్వం వేర్పాటువాద భావనల ప్రచారకునిగా “అల్- హిలాల్”ను భావిస్తింది. ప్రభుత్వం దానిని 1914 లో నిషేధించింది.హిందూ -ముస్లిం ఐక్యత ఆధారంగా విప్లవాత్మక ఆలోచనలతో మరో పత్రికను “అల్ బలఘ్” ప్రారంభించారు.1916 లో ప్రభుత్వం ఈ పత్రికను కూడా నిషేధించారు.గాంధీజీ ప్రారంభించిన "సహాయ నిరాకరణ" ఉద్యమం ను సమర్ధించి 1920 లో భారత జాతీయ కాంగ్రెస్ లో చేరాడు.ఇతడు ఢిల్లీ కాంగ్రెస్ ప్రత్యేక సెషన్ అధ్యక్షుడు గా (1923) ఎన్నికయ్యాడు.గాంధీజీ ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని 1930లో అరెస్టు అయ్యాడు. ఒక సంవత్సరంన్నర పాటు మీరట్ జైల్లో ఉంచారు. ఖిలాఫత్ ఉద్యమం, సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని 10 సంవత్సరాలపాటు జైలుశిక్ష అనుభవించాడు.మౌలానా అబుల్ కలాం ఆజాద్ 1940 (రాంగడ్) లో కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు.1942 నుండి 1946 మధ్యకాలంలో, బ్రిటిష్ ప్రభుత్వం చేత మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ కోటలో ఖైదులో ఉన్నప్పుడు "గుబార్-ఎ-ఖాతిర్" పుస్తకం
అత్యంత ముఖ్యమైన రచనలలో ఒకటి
ఇది ఉర్దూ సాహిత్యంలో ఒక విలువైన రచన అని చెప్పవచ్చు.భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన వ్యక్తిగత అనుభవాలు.
భారతదేశ విభజన వెనుక ఉన్న రాజకీయ కారణాలను మతపరమైన కారణాల కంటే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఆజాద్ దృక్కోణం నుండి స్వాతంత్ర్యం మరియు స్వేచ్ఛపై ఆయన ఆలోచనలతో ఆత్మకథాత్మక పుస్తకం "ఇండియా విన్స్ ఫ్రీడమ్" ఈ పుస్తకం భారత స్వాతంత్ర్య ఉద్యమం, ముఖ్యంగా విభజన సమయంలో జరిగిన సంఘటనల గురించి వివరిస్తుంది. ఇది మౌలానా ఆజాద్ వ్యక్తిగత అనుభవాలు మరియు స్వాతంత్ర్యం, రాజకీయాలపై ఆయన అభిప్రాయాలను తెలియజేస్తుంది.1947 ఆగష్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి మొట్టమొదటి కేంద్ర విద్యా శాఖ మంత్రి గా బాధ్యతలు చేపట్టి 1958 జనవరి 22 వరకు కొనసాగారు. ఫిబ్రవరి 22న 69 సంవత్సరాల వయసులో ఆయన మరణించడం జరిగింది.ఆయన మరణానంతరం,1992లో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న లభించింది.కవిగా పాత్రికేయునిగా స్వాతంత్ర సమరయోధుడిగా,కేంద్ర విద్యా మంత్రిగా ఆయన చేసిన సేవలకు పురస్కరించు కొని జయంతిని ప్రతి సంవత్సరం నవంబర్ 11న జాతీయ విద్యా దినోత్సవం జరుపుకుంటామన్నారు. అబ్దుల్ కలాం ఆజాద్ చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో టీజేఏ కమిటీ సభ్యులు కొత్తపల్లి మధుసూదన్, కొల్లోజు నాగేంద్ర చారి, భయ్యారపు రవీంద్ర, భీమపంగు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment