*హైడ్రాతో రియల్ ఎస్టేట్* *వ్యాపారం సర్వనాశనం.*
*ప్రభుత్వం రిజిస్ట్రేషన్* *కార్యాలయాలను నిర్మించాలి.*
తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు, సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు పంతంగి వీరస్వామి గౌడ్.
*(సూర్యాపేట, టౌన్ జులై 23)*
రాష్ట్ర ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుపై పునరాలోచించాలని ఒకవేళ మార్కెట్ వ్యాల్యూ పెంచితే రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ 3% చేయాలని తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు, సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ గార్డెన్ దగ్గర జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రిజిస్ట్రేషన్ చార్జీలను గత ప్రభుత్వం పెంచిందని గుర్తు చేశారు. తిరిగి నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచితే సామాన్య ప్రజలకు ఇబ్బందిగా మారే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలు కానుందని వివరించారు. మార్కెట్ విలువలు పెరగడం వల్ల సామాన్య ప్రజలకు బిల్డింగ్ పర్మిషన్ తో పాటు ఎల్ ఆర్ ఎస్ కు విపరీతంగా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. మార్కెట్ రేట్లు పెంచడంతో సామాన్య ప్రజలు కనీసం ఇంటిని నిర్మించుకునే పరిస్థితిలో ఉండలేరని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న చార్జీలని అమలు చేయాలని పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో ఎల్ అర్ ఎస్ కోసం ఆన్లైన్లో రూ.10,000 రూపాయలు చెల్లించిన వారికి మున్సిపాలిటీ అధికారులు ఆప్షన్ తీసుకోవట్లేదని తెలిపారు. ఎల్ఆర్ఎస్ పెండింగ్ లేకుండా రెగ్యులర్ చేసేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ కొరకు వెయ్యి రూపాయలు కట్టినవే అమలు చేస్తున్నారు తప్ప పదివేల రూపాయలు చెల్లించిన వారికి ఎల్లారీస్ రెగ్యులరైజేషన్ చేయడం లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా . 142 సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఉన్న వాటిలో పదుల సంఖ్యలో మాత్రమే సొంత భవనాలు ఉన్నాయని అద్దె భవనాలకు బదులుగా ప్రభుత్వం నూతన సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. సూర్యాపేటలో కృష్ణ కాలనీలో గత 20 సంవత్సరాల క్రితమే సబ్ రిజిస్టర్ కార్యాలయానికి ఎనిమిది గుంటల స్థలం భూమి యజమానులు సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుకు రిజిస్ట్రేషన్ చేశారని చెప్పారు. నిధులు కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. హైడ్రా వల్ల రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం సర్వనాశనమైందన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ఆధారపడ్డ ఎన్నో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్, రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కోశాధికారి పాల సైదులు, జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి అంజయ్య గౌడ్, పట్టణ గౌరవ సలహాదారుడు, మాదిరెడ్డి గోపాల్ రెడ్డి, పట్టణ ఉపాధ్యక్షుడు ఐతగాని మల్లయ్య గౌడ్, ఆకుల మారయ్య గౌడ్, పట్టణ కార్యదర్శి గిరీశం, పట్టణ ఉపాధ్యక్షుడు బానోతు జానీ నాయక్, సత్యనారాయణ రెడ్డి, నాగయ్య, పట్టణ కార్యదర్శి రాపర్తి జానయ్య, పట్టేటీ కిరణ్, సారగండ్ల కోటేషూ జిల్లా ఉపాధ్యక్షుడు కోడి లింగయ్య,కిషోర్ కుమార్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment