Sunday, June 15, 2025

ప్రైవేట్ పాఠశాలు విద్యార్థి చదువు కోసం కాదు బుక్స్ నోట్స్ అమ్మడానికి కోసం మాత్రమే

 

హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ చైతన్య టెక్నో హైస్కూల్ లో విద్యార్థి సంఘాల నాయకులకు పాఠశాల యాజమాన్యం మధ్య వివాదం.

హుజూర్ నగర్ శ్రీ చైతన్య టెక్నో హైస్కూల్ లో  ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా బుక్స్ నోట్స్ యూనిఫామ్ అంటూ తల్లిదండ్రుల నుండి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని డి వై ఎఫ్ ఐ విద్యార్థి సంఘం నాయకులకు ఫిర్యాదు అందడంతో డి వై ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి బోయిళ్ళ నవీన్ స్థానిక ఎంఈఓ కి సమాచారం ఇచ్చినా ఆయన అందుబాటులో లేకపోవడంతో  అడిగేందుకు పాఠశాలకు వెళ్ళగా సరైన సమాధానం రాకపోవడంతో పాఠశాల యాజమాన్యం విద్యార్థి సంఘం నాయకులను బెదిరింపులకు గురి చేసేలా వీడియోలు తీస్తూ మాటలు జారడంతో ఇరువురి మధ్య ఘర్షణ వాతావరణ నెలకొంది.ఇట్టి విషయంలో హుజూర్నగర్ స్థానిక పోలీస్ లు రంగ ప్రవేశం చేయడంతో ఇరువర్గాలను నచ్చజెప్పి విద్యార్థి సంఘం నాయకులను అక్కడ నుంచి పంపించినట్లు సమాచారం. ఇట్టి విషయంలో మండల విద్యాధికారి మరియు జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా కలెక్టర్ స్పందించి ప్రతి పాఠశాలను తనిఖీ చేసి ప్రభుత్వ పుస్తకాలను మాత్రమే విద్యార్థులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు

మనభూమి వార్త

హుజూర్ నగర్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

​హుజూర్ నగర్, మార్చి 7, 2026: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని బాలాజీ ఫంక్...

ఎక్కువమంది చూసినా వార్త