Monday, June 23, 2025

పంద్రాగస్ట్ నాటికి భూ సమస్య లు పరిష్కారం

రెవిన్యూ శాఖ పరిపాలన కి వెన్నముఖ లాంటిది జిల్లాలో రెవిన్యూ సదస్సులు విజయవంతం రేషన్ దుకాణాలు తనిఖీలు చేపట్టాలి. జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పంద్రాగస్ట్ నాటికి జిల్లాలో రెవిన్యూ సదస్సుల ద్వారా స్వీకరించిన అర్జీలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయం లోని సమావేశం మందిరంలో అదనపు కలెక్టర్ పి రాంబాబు తో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ భూ భారతి అవగాహన సదస్సులో అలాగే రెవిన్యూ సదస్సుల ద్వారా స్వీకరించిన అర్జీల పరిష్కరణకు రెవిన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ భూ భారతి చట్టం అమలులో భాగంగా జిల్లా వ్యాప్తంగా జూన్ 3 నుండి జూన్ 20 వరకు అన్ని గ్రామాలలో అధికారులే ప్రజల వద్దకి వెళ్ళి 44,741 అర్జీలు స్వీకరించి విజయవంతం చేసినందుకు రెవిన్యూ సిబ్బందిని కలెక్టర్ అభినందించారు.ఆ అర్జీలను మిస్సింగ్ సర్వే నెంబర్, డి ఎస్ పెండింగ్, విస్తీర్ణం సవరణ, పౌతి అమలు,భూమి స్వభావం లాంటి వాటిపై వచ్చినవి విడివిడిగా అర్జీలను వేరు చేయాలని తెలిపారు.జిల్లా వ్యాప్తంగా ఒకే రకంగా అర్జీలను ఒకే విధానం ద్వారా పంద్రాగస్ట్ నాటికి పరిష్కరించాలని సూచించారు.

అర్జీలను పరిష్కరించేందుకు ప్రతి తహసీల్దార్ కార్యాలయం లో డెస్క్ పని చేసేందుకు ఒక బృందం, క్షేత్ర స్థాయి పరిశీలన చేసేందుకు మరో బృందం ఏర్పాటు చేయాలని సూచించారు.అర్జీలు పరిష్కరించేందుకు మండలం లోని గ్రామాల వారీగా ప్రణాళికబద్దంగా షెడ్యూల్ తయారు చేసుకోవాలని అన్నారు.ముందుగా వచ్చిన అర్జీలకి సంబంధించి రెవిన్యూ రికార్డులు పరిశీలన చేసి జిరాక్స్ లను అర్జీలకి జతపర్చాలని ప్రతి జిరాక్స్ పై సంబంధిత అధికారులు అందరు సంతకం చేయాలని సూచించారు. 

తదుపరి ఎ గ్రామం లోకి అయితే క్షేత్రస్థాయి బృందం పరిశీలనకి వెళ్తున్నారో ఆ రైతులకి ముందుగానే నోటీసులు జారీ చేయాలని సూచించారు.రికార్డులు జత చేసిన అర్జీలను తీసుకొని క్షేత్ర స్థాయి పరిశీలన చేయుటకి వెళ్లాలని, అక్కడే పక్క రైతుల వాంగ్మూలం, పంచనామా చేయాలని సూచించారు.ఏమైనా వాదనలు వినాలనుకంటే అక్కడికడే పరిష్కరించు కోవాలని సూచించారు.ఒకే రకంగా జిల్లా వ్యాప్తంగా చెక్ మెమో తయారు చేసి అన్ని రికార్డ్ లను జతపర్చి అధికారులు అందరు సంతకం చేయాలని తెలిపారు.

గతంలో అర్జిలు తిరస్కరణకి గురైతే మరల అవే వస్తే మరల తిరస్కరణ చేయకుడదని పూర్తి సమాచారం పరిశీలించిన తర్వాతనే పరిష్కరించాలని అలాగే ఒక సర్వే నెంబర్ మీద కోర్ట్ కేసు ఉంటే అదే రైతుకి చెందిన ఇంకో సర్వే నెంబర్ కుడా నిషేధిత జాబితాలో ఉంటుందని వాటిని జాగ్రత్తగా పరిష్కరించాలని తెలిపారు.

భూ భారతి ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజలు ఎంతగానో ఆశతో చూస్తున్నారని రెవిన్యూ శాఖ పరిపాలన లో ముఖ్యమైనదని, వెన్నెముఖ లాంటిదని ప్రజల్లో ఉన్న నమ్మకాని నిజం చేసేలా ప్రతి అధికారి శ్రద్ద పెట్టి భూ సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. విధి నిర్వహణలో ప్రలోభాలకి గురైన, తప్పుడు ఆలోచనలతో విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుంది ఆదేశించారు.

రేషన్ దుకాణాలు తహసీల్దార్లు, రెవిన్యూ ఇన్స్ పెక్టర్ లు తనిఖీ లు చేపట్టి స్టాక్ పరిశీలించాలని, సన్న బియ్యం దుర్వినియోగం కాకుండా ముందు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. వర్ష కాలం కావునా ఆకస్మిక వర్షాలు కురిస్తే గత సంవత్సరం ఆగస్టు చివర్లో కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గంలలో వచ్చిన వరద అనుభవాలు గుర్తించుకొని ఎక్కడైనా సమస్య ఉంటే ముందు జాగ్రత్తగా పరిష్కరించుకోవాలని తెలిపారు.విద్యా సంవత్సరం మొదలు అయినందున విద్యార్థులకి ఆలస్యం కాకుండా కుల, ఆదాయం, రెసిడెన్సీ సర్టిపికెట్లు వెంటనే జారీ చేయాలని సూచించారు.

తదుపరి అదనపు కలెక్టర్ పి రాంబాబు మాట్లాడుతూ అధికారులు నిబద్దతతో పని చేసి భూ సమస్యలు పరిష్కరించాలని అన్నారు. 
బి యల్ ఓ లకి సంబందించిన పేర్లు, ఎపిక్ నెంబర్, ఫోన్ నెంబర్ బ్యాంకు అకౌంట్ వివరాలు మరోసారి పరిశీలించాలని సూచించారు. ఫారం 6,7,8 లు సరైన పద్దతిలో పైలింగ్ చేసుకుంటూ పరిష్కరించాలని తెలిపారు.

ఈ కార్యక్రమం లో ఆర్ డి ఓ లు వేణు మాధవరావు, సూర్యనారాయణ,కలెక్టరేట్ పరిపాలన అధికారి సుదర్శన్ రెడ్డి,సూపర్టీడెంట్లు,డిప్యూటీ తహసీల్దార్ లు, ఆర్ఐ లు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

No comments:

మనభూమి వార్త

హుజూర్ నగర్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

​హుజూర్ నగర్, మార్చి 7, 2026: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని బాలాజీ ఫంక్...

ఎక్కువమంది చూసినా వార్త